ఐఏండిబిలో ఆ రెండు సినిమాలని బీట్ చేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది.

అలాగే నిర్మాత దిల్ రాజు కలని నెరవేర్చింది.దర్శకుడు వేణుశ్రీరామ్ కి స్టార్ ఇమేజ్ అందించింది.

ఓవరాల్ గా ఈ మూవీ ప్రేక్షకులని కూడా మెప్పించింది.దీంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో పాటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి ప్రశంసలు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు.వీటిలో రెండు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిపోయి షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే వకీల్ సాబ్ హిందీలో అమితాబచ్చన్ నటించిన పింక్ మూవీకి రీమేక్ అన్న విషయం అందరికి తెలిసిందే.హిందీలో పింక్ డీసెంట్ హిట్ గా నిలిచింది.

దీనిని తమిళ్ లో అజిత్ హీరోగా నెర్కొండ పార్వాయి టైటిల్ తో రీమేక్ అయ్యి అక్కడ కూడా హిట్ అయ్యింది.ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఐఏండిబి రేటింగ్స్ లో వకీల్ సాబ్ మూవీ ఒరిజినల్ వెర్షన్ తరువాత వచ్చిన నెర్కొండ పార్వాయిలని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలబడటం విశేషం.అమితాబ్ పింక్ మూవీకి ఐఏండిబిలో 75.5 రేటింగ్స్ వస్తే అజిత్ నెర్కొండ పర్వాయికి 73.4 రేటింగ్స్ వచ్చింది.అయితే వకీల్ సాబ్ మూవీ మొత్తం ఏకంగా 84.4 రేటింగ్ సొంతం చేసుకొని టాప్ లో నిలబడటం విశేషం.దీనిని బట్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటించడం వలన సినిమాకి ఏ రేంజ్ లో హైప్ వచ్చిందో అర్ధమవుతుంది.

అలాగే ఆ రెండు సినిమాలని మించి ప్రజాదారణని వకీల్ సాబ్ సొంతం చేసుకుందని స్పష్టం అవుతుంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు