మెగా హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) కొండపొలం, రంగ రంగ వైభవంగా ఈ రెండు సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు.అందుకే నెక్స్ట్ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ లెక్కలు మార్చాల్సిందే అని తెగ ప్రయత్నిస్తున్నాడు.
శ్రీకాంత్ రెడ్డి ( Srikanth Reddy )డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ చేస్తున్న సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.ఉప్పెన నుంచి రంగ రంగ వైభవంగా వరకు లవర్ బోయ్ గా కనిపించిన వైష్ణవ్ తేజ్ రాబోతున్న సినిమాలో మాత్రం మాస్ టర్న్ తీసుకున్నాడట.

హీరోగా నాల్గవ సినిమా ఈ టైం లో రిస్క్ అని తెలిసినా కూడా కథ బాగా కుదరడంతో వైష్ణవ్ తేజ్ మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.మరి వైష్ణవ్ తేజ్ ఈ మాస్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల ( Sri Leela )హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది.ఉప్పెన తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం తపిస్తున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి.
ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.సినిమాలో వైష్ణవ్ తేజ్ కొత్తగా కనిపిస్తాడని టాక్.







