వైకాపా నాయకులు నాపై అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు...కిరణ్ రాయల్

వైసిపి నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారని,నా కులంపై విమర్శలతో మొదలుపెట్టి వ్యక్తిగత విమర్సలకు దిగుతున్నారని జనసేన( Janasena ) తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ తెలిపారు.

మంత్రి రోజా, టిటిడి ఇఓ ధర్మారెడ్డి( TTD EO Dharma Reddy ), తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయరెడ్డిలు నన్ను టార్గెట్ చేశారన్నారు.

నేను శ్రీవారి టిక్కెట్లను అక్రమంగా విక్రయించి ఉంటే నాపై కేసు పెట్టి అరెస్టు చేయండి అంటూ కిరణ్ రాయల్ తెలిపారు.నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు.

రెండు,మూడురోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్థమయ్యారని,భర్త లేని మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారని,ఒక భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారనన్న విషయాన్ని ఒక వైసిపి యువనేత జనసైనికులకు చెబుతున్నాడని తెలిపారు.ఆ వైసిపి యువనేత మాట్లాడిన ఆడియో తన దగ్గర ఉందని ఆడియోను తిరుపతి ఎస్పీకి వినిపించి ఫిర్యాదు చేశానని కిరణ్ రాయల్ తెలిపారు.

ఎస్పీ స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళతానని అన్నారు.వైసిపి నేతల ఆగడాలను తిరుపతి ప్రజలు గమనిస్తున్నారని,ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపుతారా అంటూ నేను భయపడను.

Advertisement

నాపై ఎలాంటి కేసులైనా పెట్టుకోండి.నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని ఏద్దేవా పలికారు.

అధికారం శాశ్వతం కాదు.వచ్చే ఎన్నికలలో టిడిపి-జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు