సినిమా ఇండస్ట్రీకి రావడానికి వివి వినాయక్ పడిన బాధలు ఎంటో తెలుసా?

నలుగురు స్నేహితులు కలిసి ఒక చోట కూర్చొని సీరియస్ గా ఒక డిస్కషన్ పెట్టుకున్నారు.

వారిలో ఒక వ్యక్తి చేతులు అటు ఇటు తిప్పుతూ కనుబొమ్మలు ఎగురవేస్తూ చాలా సీరియస్ గా తన స్నేహితులకు ఏదో కథ చెబుతున్నాడు.

అందులో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఒరేయి వినాయక్ మీ నాన్న కోపంగా వస్తున్నారు రా.ఈ దెబ్బతో నీ పని అయిపోయినట్టే అని చెప్పాడు.ఆ మాట విన్న వినాయక్ అక్కడి నుంచి పోలీసు వెనక పడితే పారిపోయిన దొంగల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇక ఆరోజు సాయంత్రం వరకు ఎవ్వరికీ వినాయక్ కనిపించలేదు.చిమ్మ చీకటి కాగానే అలా మెల్లగా ఇంటి గుమ్మం వైపు చూడగా అందరూ యుద్ధం చేయడానికి సిద్ధం అయిన వారిలా రెఢీ గా ఉన్నారు.

ఈ రోజు వాడు ఇంటికి రాగానే వేసెద్దాం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు.అందుకు గల కారణం ఏంటంటే వి వి వినాయక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని ఇంట్లో చెప్పడంతో ఆయన తండ్రి ఆగ్రహించాడు.

Advertisement

అప్పటికే గంపెడు అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని ఏదో ఒక పని చేసి ఆదుకోవాలని సూచించాడు.కానీ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అవేమీ తలకి ఎక్కించుకునే స్థితిలో లేడు వినాయక్.

ఓ మూడు నెలల పాటు ఇలాగే ఇంట్లో యుద్ద వాతావరణం కనిపించింది.

ఇక వినాయక్ వినేలా లేకపోవడంతో మరోసారి ఎక్కడైనా సినిమా గురించి మాట్లాడిన సినిమా విషయాలు తీసిన ఊరుకోను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.అయిన వినకపోవడంతో నాలుగు తగిలించాడు కూడా.రోజు అతడి పక్కనా ఎవరో ఒకరు ఎవరో ఒక దర్శకుడు గొప్పతనం గురించి మాట్లాడుకోవడం వింటూ వినాయక్ తనలోని కుతూహలన్నీ చంపుకోలేకపోయాడు.

ఇక ఎలాగైనా ఒప్పించాలని తన తండ్రి స్నేహితులందరినీ కూర్చోబెట్టి తన తండ్రిని ఒప్పించేలా చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు.అలా తండ్రి మాటను కాదని ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..
Advertisement

తాజా వార్తలు