రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దళితుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాదించాలని మంత్రి ఆకాంక్షించారు. దళిత బంధు పథకాన్ని దైవయజ్ఞం గా భావించి దళిత సోదరులు తమ జీవితాలను చక్కదిద్దుకోవటానికి ఉపయోగించుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపునిచ్చారు.
తొలిదశలో 100 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.మలిదశలో 2000 వేల మంది లబ్ధిదారులకు దళిత బంధు ను అమలు చేయబోతున్నామన్నారు.దళిత బంధు పథకం ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ S.వెంకటరావు, వివిధ మండలాల MPP లు, ZPTC లు, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.







