జ్ఞాపకాలు మిగిల్చిపోయావా అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం.. ఎమోషనల్ అయిన ఉత్తేజ్ కూతుళ్లు!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్( Uttej ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఉత్తేజ్ ఎలాంటి రోల్ లో నటించినా ఆ రోల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.2021 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన ఉత్తేజ్ భార్య మృతి చెందిన సంగతి తెలిసిందే.క్యాన్సర్ వ్యాధి( Cancer ) వల్ల ఆమె మృతి చెందగా ఆమె మరణం సినీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.

 Uttej Daughters Chetana And Paata Emotional About Her Mother Demise Details, Utt-TeluguStop.com

ఆమె మృతి చెంది రెండేళ్లు కావడంతో ఉత్తేజ్ కూతుళ్లు( Uttej Daughters ) ఎమోషనల్ అయ్యారు.

ఉత్తేజ్ కూతుళ్ల పేర్లు చేతన, పాట కాగా సోషల్ మీడియా వేదికగా వాళ్లు ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అమ్మ మాకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయిందని వాళ్లు పేర్కొన్నారు.అమ్మను మిస్ అవుతున్నామని వాళ్లు చెప్పుకొచ్చారు.

తల్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వాళ్లు ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన( Chetana ) పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.2017లో విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

ప్రస్తుతం చేతన కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.కొరియోగ్రాఫర్ గా చేతన ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించడం గమనార్హం.చిన్న కూతురు పాట( Paata ) అద్భుతంగా పాటలు పాడతారు.

పాట సింగింగ్ టాలెంట్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.తాజాగా పాట ఒక పాట పాడగా ఆ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

చేతన, పాట కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

శివ సినిమాతో ఉత్తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఉత్తేజ్ కు ఈ జనరేషన్ ఫ్యాన్స్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఉత్తేజ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్రలో పోషించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Uttej Daughters Emotional Post on Mother

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube