ప్రపంచ కుబేరుడుగా పేరుగాంచిన ఎలాన్ మస్క్( Elon Musk ) అంటే ఎవరో కార్పొరేట్ ప్రపంచంలో తెలియని వారు అంటూ ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి.అతగాడు కొన్నాళ్ల క్రితం మైక్రో బ్లాగింగ్ పోర్టల్ ట్విట్టర్( Twitter )ను టేకోవర్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.అయితే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయకముందే మొదలైన వివాదాలు, కంపెనీ ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగడం కొసమెరుపు.2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, టీమ్‌లను తొలగించి సంచలనం సృష్టించారు.

అక్కడితో ఆగకుండా పోర్టల్‌లో భారీ మార్పులకు మస్క్ శ్రీకారం చుట్టారు.అయితే ఈ మార్పులు యూజర్లను ఇంప్రెస్ చేస్తున్నాయా అంటే దాదాపుగా లేదనే చెప్పుకోవాలి.ఎందుకంటే ఆయా మార్పులు వినియోగదారులకు బొక్క పెట్టేవిగా ఉండడమే ప్రధాన కారణం.కొన్ని నెలలుగా ట్విట్టర్‌లో వస్తున్న మార్పులను చూసి యూజర్లు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా పెదవి విరుస్తున్నారు.44 బిలియన్ డాలర్‌లకు కొనుగోలు చేసిన కంపెనీ నుంచి ఎలాగన్నా ఆదాయం పొందాలనే ఉద్దేశంతోనే మస్క్ ఆయా ప్లాన్‌లు చేస్తున్నట్టు చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది.

అయితే మస్క్ చేపట్టిన సదరు నిర్ణయాలతో కంపెనీలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇపుడు స్పష్టంగా అర్ధం అవుతోంది.కొన్ని రోజులుగా కంటెంట్‌ని చదవడానికి ముందే ట్విట్టర్ ఫీడ్ రిఫ్రెష్ అయిపోవడం ఇక్కడ గమనించవచ్చు.ఈ మార్పువలన చాలామంది వినియోగదారులు నిరాశగా వున్నారు.
చాలా మంది మస్క్‌ను ట్యాగ్ చేసి, తక్షణమే గందరగోళాన్ని పరిష్కరించమని కూడా కోరడం జరుగుతోంది.మస్క్ బ్లూ టిక్ ( Blue tick )పొందని యూజర్‌లను.
ధర చెల్లించి సర్వీసు పొందేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదయితే ఎవ్వరికీ నచ్చడంలేదు సరికదా చాలామంది ట్విట్టర్ నుండి బయటకి వెళ్లిపోవడం మనం గమనించవచ్చు.