H1B Visa Lottery : ముగిసిన హెచ్ 1 బీ వీసా లాటరీ ప్రక్రియ

అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్‌లకు మాస్టర్స్ క్యాప్‌తో సహా హెచ్ 1 బీ వీసాల( H1B visas ) కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన లాటరీ ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్( United States Citizenship and Immigration Services ) (యూఎస్‌సీఐఎస్) ముగించింది.2025 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ సైన్ అప్ వ్యవధిని ఏజెన్సీ మార్చి 25తో ముగించిన సంగతి తెలిసిందే.రాండమ్‌గా షార్ట్ లిస్ట్ అయిన దరఖాస్తుదారుల ‘‘ myUSCIS accounts ’’కు నోటిఫికేషన్లు పంపబడుతున్నాయి.

 Uscis Completes H1b Visa Lottery For Fy 2025 Notifying Beneficiaries-TeluguStop.com

యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్‌లో( USCIS website ) సాంకేతిక లోపం కారణంగా 2025 ఆర్ధిక సంవత్సరానికి వీసా దరఖాస్తుల గడువు మూడు రోజుల ఆలస్యానికి కారణమైంది.

తొలుత మార్చి 22ను చివరి తేదీగా ప్రకటించగా.సాంకేతిక లోపం కారణంగా మార్చి 25కు మార్చింది యూఎస్‌సీఐఎస్.ఈ సమయంలో ఎంపిక ప్రక్రియ కోసం ప్రతి లబ్ధిదారుణ్ణి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేయడానికి , ప్రతి లబ్ధిదారునికి అనుబంధిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి పిటిషనర్లు, చట్టపరమైన ప్రతినిధులు తప్పనిసరిగా యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాను ఉపయోగించాలని అధికారులు తెలిపారు.

Telugu Fy, Hb Visas, Myuscis, Citizenship, Uscis, Uscishb, Uscis Website-Telugu

ఆన్‌లైన్ ఖాతా వినియోగదారులు తమ ఆన్‌లైన్ ఖాతాలలో మెరుగైన సంస్థాగత ఖాతా లక్షణాలతో రిజిస్ట్రేషన్ , పిటిషన్‌పై సహకరించుకోగలుగుతారు.ఫాం ఐ 129 (వలసేతర వర్కర్ కోసం పిటిషన్), ఫాం ఐ 907 (ప్రీమియం ప్రాసెసింగ్ సేవ కోసం అభ్యర్ధన)లను ఆన్‌లైన్ ఖాతాలో అందుబాటులో వుంచినట్లు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.అలాగే ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1 బీ క్యాప్ పిటిషన్‌ ఫాంల ఆన్‌లైన్ ఫైలింగ్‌ను స్వీకరిస్తామని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

నాన్ క్యాప్ హెచ్ 1 బీ పిటిషన్‌ల ఆన్‌లైన్ ఫైలింగ్‌ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏజెన్సీ స్పష్టం చేసింది.

Telugu Fy, Hb Visas, Myuscis, Citizenship, Uscis, Uscishb, Uscis Website-Telugu

కాగా, ఏటా హెచ్‌-1 బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube