రోడ్డు పక్కన చనిపోయిన జంతువు.. కళేబరాన్ని పీక్కుతిన్న యూఎస్ మహిళ..

ఇడాహోకు చెందిన మాండర్స్ బార్నెట్( Manders Barnett ) అనే 32 ఏళ్ల మహిళ రోడ్డు పక్కన చనిపోయిన జంతువులను పీక్కు తింటూ అందరిని షాక్ కి గురి చేస్తోంది.ఆమె సంచార జీవనశైలిని( Nomadic Lifestyle ) గడుపుతుంది, 2019లో ఇల్లు వదిలి ప్రపంచం మొత్తం తిరగాలనే అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించింది, ఆ క్రమంలో ఆరేళ్లుగా గుర్రంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఆమె కలుసుకుంది.

 Us Woman Eats Roadkill Because She Doesnt Want Animals To Die In Vain Details, M-TeluguStop.com

ఆమెకు అతని జీవన విధానం నచ్చడంతో అతనితో కలిసి తిరగాలని నిర్ణయించుకుంది.ఆపై తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అన్ని సౌకర్యాలను సింపుల్‌గా వదిలేసింది.

బార్నెట్ తన ఎక్కువ సమయం ఆరుబయట గడుపుతుంది.నిద్రించడానికి ఒక చిన్న స్థలాన్ని కలిగి ఉంటుంది.జంతువు అప్పుడే చనిపోయిందా లేదా చనిపోయి చాలా సేపు అవుతుందా? అనే విషయం తనకి తెలుస్తుందని ఆమె చెప్పింది.జంతు కళేబరాన్ని( Animal Carcass ) తినొచ్చో లేదో కూడా తాను తెలుసుకోగలరని ఆమె అన్నది.

అయితే బార్నెట్ చనిపోయిన జంతువుల శరీరాన్ని ఇష్టంతో తినడం లేదు, లేదా వాటిని ఎంజాయ్ చేయడం లేదు.కేవలం జంతువుల మరణం వృధా కాకూడదనే ఒక ఉద్దేశంతో ఆమె వీటిని తింటోంది.

పనిముట్లు, బట్టలు, సంచుల తయారీకి జంతువుల ఎముకలు, చర్మాలు వంటి భాగాలను కూడా ఉపయోగిస్తుంది.

రోడ్లపై డ్రైవింగ్ చేసే, జంతువులను ఢీకొట్టే వ్యక్తుల కోసం బార్నెట్ ఒక సలహా కూడా ఇస్తుంది.చనిపోయిన జంతువులను తీసుకెళ్లి తినేయకూడదని ఆమె చెప్పింది, ఎందుకంటే అవి తాజాగా లేదా తినడానికి సురక్షితంగా ఉండకపోవచ్చని వివరించింది.గాయపడిన లేదా చనిపోతున్న జంతువులను మాత్రమే పికప్ చేసుకోవాలని ఆమె చెప్పింది.

మొత్తం మీద ఈమె గురించి తెలుసుకుని చాలామంది షాక్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube