అమెరికా( America ) వెళ్లాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్ .సోమవారం నుంచి హెచ్ 1, ఎల్ 1, ఈబీ 5 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రుసుములు పెరగనున్నాయి.
ఇమ్మిగ్రేషన్ విధానాలు , అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే వీసా సేవల్లో మార్పులు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.హెచ్ 1 బీ , ( H-1B ) ఎల్ 1 ,( L-1 ) ఈబీ 5( EB-5 ) అనేవి అమెరికాకు వలస వెళ్లేందుకు భారతీయులు పొందే వీసాలు.2016 నుంచి హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ వీసా రుసుమును పెంచడం ఇదే తొలిసారి.పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ గతంలో ఫెడరల్ నోటిఫికేషన్‌లో ఇలా పేర్కొంది.‘‘ ఫీజు సర్దుబాట్లు , యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ( USCIS ) ఉపయోగించే ఫాంలు , ఫీజు స్ట్రక్టర్‌లలో మార్పులు బదిలీకి దారితీస్తాయి ’’.హెచ్ 1 బీ దరఖాస్తు వీసా రుసుము విషయానికి వస్తే గతంలో దీని ధర 460 డాలర్లు (భారత కరెన్సీలో రూ.38 వేలు ) కాగా .దానిని 780 డాలర్లు (భారత కరెన్సీలో రూ.64 వేలు)కు పెంచింది.అంతేకాకుండా హెచ్ 1 రిజిస్ట్రేషన్ రుసుము కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు (భారత కరెన్సీలో రూ.17 వేలు) పెరగనుంది.
కాగా, ఏటా హెచ్-1 బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా( US Visa ) జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు( Foreign Students ) మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.
ఇక ఎల్ 1 వీసాల రుసుము 460 డాలర్లు (భారత కరెన్సీలో రూ.38 వేలు) నుంచి 1,385 డాలర్ల (భారత కరెన్సీలో రూ.1,10,000)కు పెంచారు.ఎల్ 1 వీసా అనేది యూఎస్‌లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ.
ఇది ఇంట్రా కంపెనీ బదిలీదారుల కోసం రూపొందించబడింది.ఇది బహుళజాతి కంపెనీలు తమ విదేశీ కార్యాలయాల నుంచి నిర్దిష్ట ఉద్యోగులను అమెరికాలో తాత్కాలికంగా పనిచేయడానికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.
మరోవైపు.పెట్టుబడిదారుల వీసాలుగా ప్రసిద్ధి చెందిన ఈబీ వీసా రుసుములు 3,675 డాలర్లు (భారత కరెన్సీలో రూ.3,00,000) నుంచి 11,160 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.9,00,000)కు పెరిగింది.1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈబీ 5 కార్యక్రమం .10 ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడటమో లేదంటే 5 లక్ష డాలర్ల పెట్టుబడి పెట్టిన వ్యక్తికి అతని కుటుంబ సభ్యులు ఈబీ వీసాను పొందేందుకు అర్హులు.