అమెరికాలో వలస దారులని నిర్భందించిన తరువాత వారి పిల్లలని సైతం వారినుంచీ వేరు చేసి.ఎన్నో విమర్శలు పాలయ్యారు ట్రంప్.
తల్లి తండ్రులు ఒక చోట పిల్లలని ఒక చోట ఉంచడం హేయమైన చర్యగా తిట్టిపోశారు అందరూ అయితే.ట్రంప్ ఇవేమీ పట్టించుకోలేదు.
అమెరికా షట్ డౌన్ అయిన సమయంలో ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ ఆధీనంలో ఉన్న పిల్లలు వరుస మరణాలు చెందటం మరో తలనెప్పిగా తయారయ్యింది ట్రంప్ కి.గ్వాటెమాలాకు చెందిన ఓ బాలుడు , న్యూమెక్సికో సిటీలోని ఇమిగ్రేషన్ కస్టడీలో ఉన్నాడు అయితే మంగళవారం రోజున ఆ బాలుడు మరణించినట్టుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.దీంతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇమిగ్రేషన్ పరిధిలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుందని అంటున్నారు.

అయితే మరణించిన బాలుడిని ఫిలిప్ జి గా ఫోనిక్స్ లోని గ్వాటెమాలా కాన్సలేట్ అధికారులు తెలిపారు.మరణించిన ముందు రోజునే అతడు తీవ్రమైన అస్వస్తతకి లోనయ్యాడని, వెంటనే న్యూమెక్సికోలోని అలగోర్డోలో వున్న ఒక ఆస్పత్రికి అతడి తండ్రితో కలిసి తీసుకు వెళ్లారని అధికారులు తెలిపారు.