అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. తన ప్రత్యర్ధి వివేక్ రామస్వామిని ప్రశంసించిన ట్రంప్

అమెరికాకు అధ్యక్షులుగా పనిచేసిన వారు మాజీలైన తర్వాత ఏదో ఒక వ్యాపకంలో బిజీగా వుంటారు తప్పించి మరోసారి రాజకీయాల వైపు తొంగిచూడరు.కనీసం మీడియాలో కనిపించేది కూడా తక్కువే.

 Us Presidential Election 2024 Donal Trump Lauds Rival Indian-american Vivek Rama-TeluguStop.com

కానీ డొనాల్డ్ ట్రంప్( Donal Trump ) అలా కాదు.అధికారంలో వున్నా లేకపోయనా తగ్గేదే లేదంటారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential election 2024 ) మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.అటు డెమొక్రాటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) కూడా సై అన్న సంగతి తెలిసిందే.

దీనికి తోడు ఇరు పార్టీలకు చెందిన మరికొందరు ఆశావహులు కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.వీరిలో పలువురు భారత సంతతి నేతలు కూడా వున్నారు.

Telugu Cbs Yougov, Democratic, Donal Trump, Indian American, Joe Biden, Republic

రిపబ్లిక్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) కూడా వీరిలో ఒకరు.ట్రంప్ లాంటి శక్తివంతమైన నేతకు పోటీగా ఆ పార్టీలో వివేక్ కూడా రేసులో నిలిచారు.ఈ క్రమంలో వివేక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్.ఇటీవల రిపబ్లికన్ ప్రైమరీ పోల్ ‘‘CBS YouGov’’లో బాగా పనిచేసినందుకు గాను వివేక్‌ను అభినందించారు.తన పరిపాలనను వివేక్ పలుమార్లు మెచ్చుకున్నారని.ఆయన గురించి తనకు తెలుసునని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో రాశారు.

Telugu Cbs Yougov, Democratic, Donal Trump, Indian American, Joe Biden, Republic

ఇకపోతే.ఈ ఏడాది ఫిబ్రవరిలో వివేక్ రామస్వామి తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.

హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.

అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube