వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదని విమర్శించారు.పక్క రాష్ట్రంలోని వ్యక్తికి రూ.18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తారా అని ప్రశ్నించారు.తెలంగాణ సంపద ఏమైనా కేసీఆర్ జాగీరా అన్న షర్మిల బీఆర్ఎస్ ఖజానాలో ఉన్న రూ.1250 కోట్లు సరిపోవడం లేదా అని నిలదీశారు.ప్రభుత్వ ఉద్యోగాలను కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తారా అని ప్రశ్నించారు.







