అమెరికా : 2021 ఏడాదిలో బిడెన్, కమలా హారీస్ ఎంత సంపాదించారో తెలుసా...!!!

అమెరికా లాంటి అతిపెద్ద ధనిక దేశానికి అధ్యక్షుడుగా ఉన్న వారు తక్కువ సంపాదన ఆర్జిస్తే ఎలా అధ్యక్షుడికి తగ్గట్టుగా, ఉపాధ్యక్షులకు తగ్గట్టుగానే వారి సంపాదన ఉండాలి.

అందుకే ఈ విషయంలో ఇద్దరు పాలకులు గట్టి పోటీ పడ్డట్టుఉన్నారు.

ఒకరిని మించి ఒకరు గత ఏడాది సంపాదనలో ముందున్నారు.అమెరికా రాజకీయ సాంప్రదాయాల ప్రకారం.

అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఎవరైనా సరే వారి సంపాదన, ఆస్తుల విషయాలను బహిర్గతంగా వెల్లడించాలి.ఈ ఏడాది తాము ఎంత సంపాదించాము అనేది లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచాలి.

ఈ సంస్కృతీ కొన్ని దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోంది కూడా.తాజాగా ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు బిడెన్ కమలా హారీస్ లు 2021 ఏడాది లో తమ సంపాదన ఎంత అనే వివరాలను వెల్లడించారు.

Advertisement

గత ఏడాది అధ్యక్షుడు బిడెన్ సంపాదన 6,10,702 డాలర్ల ఆదాయం ఉండగా, ఈ ఆదాయంలో పై చెల్లించిన పన్ను 1,50,439 డాలర్లు.అయితే ఈ ఆదాయం మొత్తం బిడెన్ ఒక్కడిదే కాదు ఆయన సతీమణిది కూడా ఇద్దరూ కలిసి సంపాదించిన దానిపై వచ్చిన ఆదాయం.

ఇక ఉపాధ్యక్షురాలు ఆమె భర్త కలిసి పొందిన ఆదాయం అక్షరాలా 16,55,563 డాలర్లు.దీనిపై వారు కట్టిన ట్యాక్స్ మొత్తం 5,23,371 డాలర్లు.

1970 నుంచీ అధ్యక్షుల ఆదాయాలను వెల్లడించే సంస్కృతీ అమెరికాలో ఉందని అందుకే అధ్యక్షుల గత ఏడాది ఆదాయ వివరాలను వెల్లడించమని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.ఇదిలాఉంటే

ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అధ్యక్షుడు బిడెన్ ను బీట్ చేసి మరి ముందు వరుసలో ఉందని, ఈ విషయంలో బిడెన్ వెనుకపడ్డారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఈ ఒక్క విషయంలోనే కాదు తదుపరి అధ్యక్ష బరిలో కూడా కమలా హారీస్ ముందుఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.కాగా ట్రంప్ తన హయాంలో తన ఆదాయ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు దాంతో బిడెన్ ట్రంప్ చేసిన ఈ తప్పును రాజకీయంగా మలుచుకున్నారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ట్రంప్ తన అక్రమ సంపాదన ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందోనని బయపడ్డారని, అందుకే ఆదాయ వివరాలు వెల్లడించలేదని విమర్సలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు