హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనుల కోసం అమెరికాలో కొత్త కాకస్.. చట్టసభ సభ్యుల మద్ధతు

ద్వైపాక్షిక కాంగ్రెషనల్ హిందూ, బౌద్ధ, సిక్కు, జైన్ అమెరికన్ కాకస్‌లో రెండు డజన్లకు పైగా యూఎస్ చట్టసభ సభ్యులు చేరారని దాని వ్యవస్థాపకుడు , భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానేదార్( Shri Thanedar ) తెలిపారు.హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులకు మతపరమైన వివక్షను ఎదుర్కోవడానికి , మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కాకస్‌ను థానేదార్ శుక్రవారం యూఎస్ కాంగ్రెస్‌లో అధికారికంగా ప్రారంభించారు.

 Us Lawmaker Launches Caucus To Protect Interests Of Hindus, Buddhists, Sikhs, Ja-TeluguStop.com

కాంగ్రెషనల్ కాకస్ అనేది యూఎస్ కాంగ్రెస్( United States Congress ) సమూహం.ఇది సాధారణ శాసన లక్ష్యాలను సాధించడానికి సమావేశమవుతుంది.

Telugu Congressman, Jains, Joe Biden, Republican, Shri Thanedar, Sikhs, Congress

ఈ సందర్భంగా థానేదార్ మాట్లాడుతూ.తాము కేవలం మరోక సమావేశాన్ని ప్రారంభించడానికి మాత్రమే గుమిగూడటం లేదన్నారు.తాము ఒక ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించడానికి సమావేశమవుతున్నామన్నారు.ప్రతి విశ్వాసం, ప్రతి సంస్కృతి, ప్రతి సమాజానికి అమెరికాలో చోటు వుందని చాటి చెప్పే ఉద్యమమని థానేదర్ పేర్కొన్నారు.

నా పేరు శ్రీ థానేదర్.కాంగ్రెస్‌లో అమెరికా వైవిధ్యానికి తానే నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన భారతీయ అమెరికన్ల బృందం థానేదర్ వెంట యూఎస్ కేపిటల్ మెట్ల వద్దకు వచ్చింది.

Telugu Congressman, Jains, Joe Biden, Republican, Shri Thanedar, Sikhs, Congress

మత వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి, వైవిధ్యాన్ని పెంపొందించడానికి నిబద్ధతతో ముందుకు వెళ్తామని థానేదర్ చెప్పారు.మత స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి, మన ఉనికిని కాపాడుకోవడానికి, ద్వేషం, మతోన్మాదాన్ని వెనక్కి నెట్టడానికి ఈ కాకస్ ఒక వేదికను సృష్టిస్తుందని ఆయన తెలిపారు.రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నుంచి 27 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ కాకస్‌లో చేరారని థానేదర్ చెప్పారు.అమెరికాలో సుమారు 3 మిలియన్ల మంది హిందువులు.1.2 మిలియన్ల మంది బౌద్ధులు.5 లక్షల మంది సిక్కులు.2 లక్షల మంది జైనులు ( Jains )ఈ దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితాన్ని సుసంపన్నం చేస్తున్నారని థానేదర్ పేర్కొన్నారు.అమెరికా( America )లో 1000 హిందూ దేవాలయాలు, 1000 బౌద్ధ దేవాలయాలు, 800 సిక్కు గురుద్వారాలు, 100 జైన దేవాలయాలు వున్నాయని ఆయన చెప్పారు.

ఇవి సమాజ అభివృద్ధికి, దాతృత్వానికి , ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కేంద్రాలుగా పనిచేస్తున్నాయని థానేదర్ వెల్లడించారు.హెచ్‌బీఎస్‌జే అమెరికన్ కాంగ్రెషనల్ కాకస్ నాలుగు ప్రాథమిక లక్ష్యాలను నెరవేర్చే ఉద్దేశంతో వుందని తెలిపారు.

అవి మతపరమైన వివక్షను ఎదుర్కోవడం, ఖచ్చితమైన ప్రాతినిథ్యం, సాంస్కృతిక అపార్థాలను పరిష్కరించడం, సాధికారత మరియు శ్రేయస్సు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube