ప్రియురాలిని 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న మాజీ సైనికుడు

నిజమైన ప్రేమకు చావు లేదు అనేది చాలా మంది చెప్పే మాట.అయితే అది ఎంత వరకు నిజమో అనేది పక్కన పెడితే, నిజమైన ప్రేమకు కాలంతో పనిలేదు ఎంతకాలమైన అలానే ఉంటుంది అని తాజాగా అమెరికాకు చెందిన ఓ మాజీ సైనికులు ప్రేమకథ నిరూపించింది.

అమెరికా సైన్యంలో పని చేసిన మాజీ సైనికుడు ప్రేమకథ ఇప్పుడు ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.1954లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇద్దరు ప్రేమకు బీజం పడింది.కెటి రాబిన్స్ అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో లో ఈ దేశానికి చెందిన జెన్నిన్ అనే యువతిని తొలిచూపులోనే ప్రేమించాడు.

ఆమె నివాసం ఉండే చోట రాబిన్స్ పనిచేసే పోలీస్ స్టేషన్ ఉండేది దాంతో ఒక రోజు జెన్నిన్ నీ చూడడం తొలి చూపులోనే ప్రేమలో పడడం జరిగిపోయింది.దీంతో రాబిన్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రియురాలికి తన ప్రేమ విషయం చెప్పాడు.

తాను కూడా అతని ప్రేమను అంగీకరించింది.ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాబిన్స్ వేరొక ప్రాంతానికి వెళ్లి పోవాల్సి వచ్చింది.

ఆ సమయంలో నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తానని రాబిన్స్ ఆమెకు ప్రామిస్ చేశాడు.అలా అలా 1944లో విడిపోయిన రాబిన్స్, జెన్నిన్ మరల 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ లో కలుసుకున్నారు.

Advertisement

వయసులో ఉన్న ఆమె ఫొటో చూపించి నిన్ను ఇప్పటికి మర్చిపోలేదు నా మదిలో ఎప్పటికీ నువ్వే ఉంటావు అంటూ ఆమెకు మరోసారి తన ప్రేమ రాబిన్స్ తెలియజేసి దగ్గర తీసుకోవడం జరిగింది.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతు ఏకంగా 1.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు