అమెరికా కోర్టు తీర్పు : భారత ఎన్నారైలకు నిరాశేనా...

తమ పిల్లలను అమెరికాలో ఉండేందుకు గాను హక్కు కల్పించాలని, అందుకు ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలంటూ భారత ఎన్నారైలు అమెరికా కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే.

ఈ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసానం తాజాగా భారత ఎన్నారైలకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించింది.

దాంతో ఎన్నారైలకు తీవ్ర నిరాశే ఎదురయ్యింది.ఇంతకీ ఎన్నారైలు కోర్టును ఎందుకు ఆశ్రయించారు.

వారి డిమాండ్ ఏంటి, కోర్టు ఎందుకు వారిని అనుకూలంగా తీర్పు ఇవ్వలేదనే వివరాల ల్లోకి వెళ్తే.అమెరికాలో ఎంతో మంది ఎన్నారైలు ఏళ్ళ తరబడి గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతానికి వారందరూ హెచ్-1బి వీసాతో అమెరికాలో ఉంటున్నారు.అయితే వీరందరికీ గ్రీన్ కార్డ్ రావాలంటే దాదాపు 50 ఏళ్ళ పైనే పడుతుంది.ఈ క్రమంలో వారి పిల్లలకు, వారి జీవిత భాగస్వాములకు హెచ్ -4 వీసా ద్వారా అమెరికాలో ఉండేందుకు అర్హత కల్పిస్తారు.హెచ్-1బి వీసా దారుల పిల్లలను డ్రీమర్స్ గా అక్కడ పిలుస్తారు.వారికి 21 ఏళ్ళు వచ్చే వరకూ వారికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అమెరికా చట్టాల ప్రకారం వారికి 21 ఏళ్ళు దాటిన వెంటనే వారికి అమెరికాలో ఉండేందుకు ఎలాంటి అర్హతలు ఉండవు దాంతో వారిని అమెరికా నుంచీ పంపెయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisement

వారు అమెరికాలో కొనసాగాలంటే వారికి తప్పకుండా వీసా ఉండాల్సిందే కానీ.వారి పిల్లలు స్టూడెంట్ వీసాలు పొందడం అంత సులభంగా అయ్యే పనికాదు.దాంతో తమ పిల్లలను ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కించాలని, వారికి అమెరికా సిఎస్పీఏ చట్టంలోని నిభందనలు అమలయ్యేలా చూడాలని కోర్టుని అభ్యర్ధించారు కానీ కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో ప్రస్తుతం వారి ఆశలన్నీ అమెరికా చిల్డ్రన్ యాక్ట్ పైనే ఉన్నాయి.

చట్టసభలలో ఈ బిల్లు పాస్ అయితే మాత్రం భారత ఎనరైలకు పెద్ద భారం దిగినట్టే.

Advertisement

తాజా వార్తలు