కన్నడ హీరో ఉపేంద్ర( Upendra ) దర్శకత్వంలో వచ్చిన ఓం సినిమా( Om Movie ) గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది.ఈ సినిమా విడుదలై నేటికీ 28 ఏళ్లు పూర్తవగా దీనికి సంబంధించి అనేక రికార్డులు కూడా నెలకొని ఉన్నాయి.
ఈ చిత్రం గత 28 ఏళ్లలో 550 సార్లు రి రిలీజ్ చేసుకుని లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్తానం దక్కించుకుంది.ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించగా, ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో కర్ణాటక ప్రభుత్వం నుంచి పలు అవార్డు కూడా దక్కాయి.
అయితే ఓం సినిమాకి ఇది మాత్రమే కాదు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి.ఇప్పటి తరంలో అయితే ఉపేంద్ర ఆలోచించినట్లు ఎవరు ఆలోచించరు అని ఈ విశేషాలను బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంతకీ అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉపేంద్ర హీరోగా రావడానికి ముందే కాలేజీ రోజుల్లోనే ఓం చిత్రం కథను తానే స్వయంగా రాసుకున్నాడు.కేవలం 70 లక్షల రూపాయలతోనే ఈ చిత్రాన్ని విడుదల చేయగా అది అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది అంతేకాదు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా డిజిటల్ రైట్స్ సేల్ కి పెడితే ఉదయ్ టీవీ ఈ చిత్రాన్ని 10 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు.ఇక ఈ చిత్రానికి ఈ మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కావడం విశేషం.కథ అయితే రాసుకున్నాడు కానీ దానికి కార్యరూపం వచ్చేసరికి ఎందుకో ఉపేంద్ర ఈ సినిమా పూర్తిగా రాంగోపాల్ వర్మ శివ సినిమా లాగా వస్తుండడంతో కథలో అనేక మార్పులు చేశాడు.
ఇక ఈ చిత్రంలో నటించేందుకు గాను కాకుండా జైల్లో మగ్గుతున్న మాఫియా డాన్, నిజమైన నేరగాళ్లకు బెయిల్ పై విడిపించి మరి ఈ సినిమాలో పెట్టుకున్నాడు ఉపేంద్ర. అంతే కాదు లోకంలో ఉండే కొంతమంది రౌడీషీటర్స్ ని కూడా నిజమైన వారిని ఈ చిత్రం కోసం ఉపయోగించుకున్నాడు.ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్( Shiva Raj Kumar ) ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలిసి ది వీక్ మ్యాగజిన్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో నటించకూడదు అంటూ తన ఒక కవర్ పేజి లో ప్రచురించడం విశేషం.