'యానిమల్' నుండి ఫస్ట్ సింగిల్.. రణబీర్ తో రష్మిక లిప్ లాక్.. పోస్టర్ అదిరింది!

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్”( Animal Movie ) ఒకటి.ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Update Form Ranbir Kapoor Rashmika Animal First Single Details, Animal, Animal F-TeluguStop.com

ఇప్పటికే భారీ హోప్స్ పెంచేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది.దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పెంచేస్తూ పోతున్నారు.

ఈ సినిమాను మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై సౌత్ వారు కూడా ద్రుష్టి పెట్టారు.ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే అంచనాలు పెంచేసుకున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా నుండి వీరిద్దరి ఫస్ట్ లుక్స్ ఇప్పటికే వచ్చేసాయి.

ఇటీవలే యానిమల్ విలన్ ను కూడా పరిచయం చేసిన సందీప్ రెడ్డి ఆ తర్వాత టీజర్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పాడు.టీజర్ తో అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరడంతో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కు( Animal First Single ) ముహూర్తం ఖరారు చేసారు.అయితే ఫస్ట్ సింగిల్ పోస్టర్ తో సందీప్ రెడ్డి తన మార్క్ చూపించాడు.

ఎందుకంటే అర్జున్ రెడ్డి మొదలుకుని ఈయన సినిమాల్లో లిప్ లాక్ ఉండేలా చూసుకుంటున్నాడు.

మరి ఇప్పుడు ఏకంగా ఫస్ట్ సాంగ్ పోస్టర్ లో రణబీర్, రష్మిక లిప్ లాక్ ఇచ్చుకుంటున్న పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ సాంగ్ పై ఆసక్తి పెరిగింది.‘అమ్మాయి’ అంటూ సాగే ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube