సౌత్ నుండి మరో అసలైన పాన్ ఇండియా మూవీ.. ఈసారి కూడా విజయం ఖాయమా?

ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.

 Upcoming Pan India Movie For South Rocketry: The Nambi Effect, R. Madhavan, Scientist Nambi Narayan Biopic,pan India Movie,rocketry: The Nambi Effect, Rrr,star Heroes-TeluguStop.com

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఆ తర్వాత ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.

మహేష్ బాబు ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా చేయబోతున్నాడు.

 Upcoming Pan India Movie For South Rocketry: The Nambi Effect, R. Madhavan, Scientist Nambi Narayan Biopic,Pan India Movie,Rocketry: The Nambi Effect, RRR,Star Heroes-సౌత్ నుండి మరో అసలైన పాన్ ఇండియా మూవీ.. ఈసారి కూడా విజయం ఖాయమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఇంకా కెజిఎఫ్ 2 సినిమాతో యష్ కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు.ఇలా స్టార్ హీరోలు దాదాపు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతున్నారు.

ఒక పక్క బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస ప్లాపులతో సతమతం అవుతుంటే మన సౌత్ మాత్రం వారికీ గుక్కతిప్పుకోకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తూ బెంబేలిత్తిస్తున్నారు.

బాలీవుడ్ కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటాలి అనుకున్న నెరవేరడం లేదు.

ఇలా వాళ్ళ ప్రయత్నాలు సాగుతుండగానే మన సినిమాలు మాత్రం దూసుకు పోతున్నాయి.ఇటీవలే కోలీవుడ్ నుండి విక్రమ్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరొక పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

స్పేస్ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా రాబోతుండడంతో అంతటా ఆసక్తి కనిపిస్తుంది.ఆర్ మాధవన్ నటించిన రాకెట్రీ : నంబి ఎఫెక్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఇది సైన్టిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్.

జులై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆర్ మాధవన్ నటించడమే కాకుండా ఈ సినిమాను డైరెక్ట్ చేసి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.విభిన్న కథతో వస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా హిట్ అయ్యే విధంగానే కనిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube