వామ్మో.. చరణ్ పై ఉపాసనకు ఇంత ప్రేమా.. థియేటర్ లో పేపర్లు చించుతూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో చరణ్ ఉపాసన జోడీ కూడా ఒకటని చెప్పవచ్చు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చర్చ జరుగుతోంది.

 Upasana Throws Papers In Theatre Details Here Goes Viral , Throws Papers , Upas-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాను చూడాలని అనుకున్నా తమకు టికెట్లు దొరకలేదని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

అయితే చరణ్ భార్య ఉపాసన చరణ్ తో కలిసి భ్రమరాంబ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు.ఉపాసన థియేటర్ కు వెళ్లి సినిమా చూడటంలో ఆశ్చర్యం లేకపోయినా ఆమె పేపర్లు చించుతూ ఆ పేపర్లను విసిరేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.

ఉపాసన తొలిసారి ఈ విధంగా చేయడంతో చరణ్ అభిమానులతో పాటు ఉపాసన అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురి కావడం గమనార్హం.

Telugu Charan, Charan Upasana, Rrr, Tarak, Throws Papers, Tollywood, Upasana-Mov

ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ సాధించడంతో చరణ్, తారక్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.ఉపాసన గట్టిగా అరుస్తూ పేపర్లు గాలిలో విసిరేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు.రామ్ చరణ్ పై కూడా కొన్ని పేపర్లను విసురుతూ ఉపాసన హడావిడి చేయడం గమనార్హం.

ఉపాసన రచ్చకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.చరణ్, తారక్ కెరీర్ బెస్ట్ హిట్ గా ఆర్ఆర్ఆర్ నిలిచిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

రికార్డు స్థాయి థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగా టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అవుతోంది.నగరాలు, పట్టణాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది.

ఆర్ఆర్ఆర్ తొలిరోజు కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.ఉపాసన పేపర్లు విసిరేస్తూ చరణ్ పై ప్రేమను బయటపెట్టారు.

ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube