జనసేన పార్టీకి ఉపాసన 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారా.. అసలు వాస్తవాలు ఇవే!

ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి( Janasena party ) ఉపాసన 5 కోట్ల రూపాయల విరాళం( 5 crore donation ) ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న వార్త నిజమా కాదా అని విచారిస్తే మాత్రం ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని సమాచారం అందుతోంది.

ఉపాసన మెగా కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఈ వార్త ప్రచారంలోకి వచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జనసేన ఈ ఎన్నికల్లో ప్రస్తుతం 21 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

రాయలసీమలో( Rayalaseema ) కేవలం రెండే రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది.ఈ నియోజకవర్గాలలో ఒకటి రైల్వే కోడూరు( Railway Kodur ) కాగా మరొకటి తిరుపతి కావడం గమనార్హం.

ఉపాసన జనసేన పార్టీకి విరాళం ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

జనసేన పార్టీ తక్కువ స్థానాలలోనే పోటీ చేసినా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నమ్ముతున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉండగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.పవన్ సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

జనసేన పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు గెలిచేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పరంగా ఇతర హీరోలతో పోల్చి చూస్తే టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు.

జనసేన మరిన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేసి ఉంటే మాత్రం ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   
Advertisement

తాజా వార్తలు