గోల్డెన్ గ్లోబ్ వేదికగా ఉపాసన విత్ లక్ష్మి ప్రణతి.. పిక్ అదిరిందిగా!

ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.

ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ వైడ్ గా రిలీజ్ అయ్యి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.గత ఏడాది వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి అదరగొట్టారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలకు కూడా ఎంపికైన విషయం విదితమే.మరి ఈ వేడుకల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా యూఎస్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి లతో పాటు వారి భార్యలు సైతం ఈ వేడుకలో మెరిశారు.మరి ఈ వేడుకలో భాగంగా ఒక్కో ఫోటో బయటకు రావడం వైరల్ కావడం జరుగుతూనే ఉంది.తాజాగా మన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ భార్యల ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ ఇద్దరి హీరోల భార్యలు దిగిన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది.ఉపాసన, లక్ష్మి ప్రణతి సెల్ఫీ లో అదరగొట్టగా ఈ పిక్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు