25 వేల మందిని తీసేసిన ప్రభుత్వం

ఉత్తర ప్రదేశ్‌లో సీఎం యోగి ఆధిత్యనాధ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

రాష్ట్రంలో ఉన్న మొత్తం హోం గార్ట్‌ల నుండి 25 వేల మందిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

హోం గార్ట్‌లకు భారీ ఎత్తున రోజువారి భత్యం ఇవ్వాల్సి వస్తుంది.వారికి తాజాగా మరోసారి రోజు వారి వేతనంను పెంచడంతో మరింత భారం అవుతుందనే ఉద్దేశ్యంతో 25 వేల మంది హోం గార్డులను తొలగించాల్సిందిగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

యూపీ మొత్తంలో 25 వేల మంది హోం గార్డ్‌లను తొలగించగా ఇక 90 వేల మంది హోం గార్డులు మిగిలి ఉంటారు.వారికి కూడా కాస్ట్‌ కట్టింగ్‌ను ప్రభుత్వం వర్తింపజేస్తోతంది.

ఆ 90 వేల మందిని కూడా నెల మొత్తం కాకుండా నెలలో 15 రోజుల చొప్పున పని చేయించుకోవాలని నిర్ణయించారు.అంటే వారి జీతం సగం ఇస్తే సరిపోతుంది.

Advertisement

రోజు వారి వేతనం కనుక సగం డబ్బులతో హోగార్డులతో అవసరం తీర్చుకోవచ్చు అంటున్నారు.రోజుకు 672 రూపాయల జీతంతో 15 రోజులు పని చేసే వారికి నెలలో 10 వేల రూపాయలు మాత్రమే వస్తాయి.

ఈ రోజుల్లో పదివేల రూపాయలతో ఏం బతుకు ముందుకు సాగుతుంది చెప్పండి అంటూ హోం గార్డు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు