శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభిత,సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మేజర్.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
పాన్ ఇండియా స్థాయి లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో మంచి టాక్ సొంతం చేసుకుంది.ముఖ్యంగా దేశ రక్షణ కోసం జవాన్లు పడే కష్టం గురించి ఎంతో అద్భుతంగా చూపించారు.
దేశ రక్షణ కోసం చివరి క్షణం వరకు సందీప్ పోరాడిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది.ఈ విధంగా ప్రతి ఒక్కరి హృదయాలను తాకిన ఈ సినిమా పై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.
ఈ విధంగా ఈ సినిమా చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమా పై, సినిమాలో నటించిన అడవి శేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా మేజర్ సినిమాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీక్షించారు.
ఈ సినిమా చూసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.నేడు మేజర్ చిత్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.

మేజర్ చిత్ర బృందంతో పాటు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లితండ్రులు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించడమేకాకుండా ప్రతి ఒక్కరికి వెండి కాయిన్స్ బహుమానంగా అందించారు.కేవలం చిత్ర బృందానికి మాత్రమే కాకుండా సందీప్ తల్లిదండ్రులను కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు.ఇక ఈ ఫోటోలను అడివి శేష్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.







