తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక హీట్ పెంచింది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీలు పోటీకి రంగం సిద్ధం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి.
ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.ఈ మేరకు సభకు రెండు రోజుల ముందే బీజేపీ తెలంగాణ శాఖ బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించింది.
అయితే, మునుగోడులో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది.