తిరుగులేని మోడీ మానియా: హస్తిన కుర్చీ మోడీదేనా?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో( Assembly elections ) తెలంగాణలో మాత్రమే తన సత్తా చూపించగలిగినా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్లలో అధికారాన్ని కోల్పోవడం జాతీయ కాంగ్రెస్కు అతిపెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి.ముఖ్యంగా పెద్దగా వ్యతిరేకత లేని చతిస్ఘడ్ ను కోల్పోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది.

 Unstoppable Modi Mania, Assembly Elections, Telangana, Narendra Modi , Bjp-TeluguStop.com

గత పది సంవత్సరాలుగా తిరుగులేని ఆదిపత్యం తో దేశాన్ని ఏలుతున్న మోడీని ( Narendra Modi )ఓడించడానికి ఈసారి జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కూటమి కూటమికట్టి దానికి ఇండియాగా నామకరణం చేశాయి.

Telugu Assembly, Congress, Narendra Modi, Telangana-Telugu Political News

ప్రతిపక్షాల కూటమి తరుపున ఒక్కొక్క ఎంపీ అభ్యర్థుని మాత్రమే నిలబెట్టాలని తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని భారీ ఎత్తున వ్యూహానికి తెర తీసాయీ .ఇంకా సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందే మూడు రాష్ట్రాలు ఎన్నికలలో తన మానియా చూపించడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష కూటమి కి అతిపెద్ద సవాలను మోడీ విసిరినట్టు అయ్యింది .తనను ఢీకొట్టడం అంత సులువు కాదని ప్రజల్లో తనకున్న పట్టును ఎన్ని కూటములు వచ్చినా చెరిపి వేయలేవన్న భారీ సందేశాన్ని ప్రధాని మోదీ( Narendra Modi ) ఇచ్చేశారు .దేశవ్యాప్తంగా తిరుగులేని నేతలు గా చలామణి అయినవారు కూడా ఏదో ఒక సందర్భంలో పట్టు కోల్పోవడం చూసాం .

Telugu Assembly, Congress, Narendra Modi, Telangana-Telugu Political News

అయితే సగటు భారతీయ ఓటర్ నాడిని పట్టుకోవడంలో తనకు మించిన రాజకీయ చాణక్యుడు లేడు అని నిరూపించుకున్న మోడీ, ( Narendra Modi )ఎన్నిసార్లు కిందపడినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్న విధానం రాజకీయ విద్యార్థులకు సరికొత్త పాఠంగా నమోదు చేయవచ్చు .ముఖ్యంగా ఎన్నికలకు సమీఫైనల్గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాలు ఎన్నికల్లో విజయదుంధుభి మోగించిన భాజపా, ప్రతిపక్ష కూటమి మానసిక ధైర్యాన్ని ముక్కలు చేసిందని చెప్పవచ్చు .మరి ఇంత తక్కువ సమయంలో మోడిని అడ్డుకునే సక్సెస్ మంత్రాన్ని ప్రతిపక్ష పార్టీలు పట్టుకోగలుగుతాయో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube