దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ 3.0 కూడా ప్రకటించారు. మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగబోతుందంటూ ప్రకటన వచ్చింది.అయితే కేంద్ర ప్రభుత్వం ఇదే సమయంలో పలు సడలింపులు ఇచ్చింది.కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రజల్లో లాక్‌డౌన్ మూడ్ అలాగే ఉంచాలి.కొద్ది పాటి మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అన్నట్లుగానే రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను కొనసాగిస్తూనే పలు రంగాలకు మినహాయింపును ఇవ్వబోతున్నారట.
కొన్నింటిని అధికారికంగా ప్రకటించబోతున్నారు.
మరికొన్ని మాత్రం అనధికారికంగా సడలించబోతున్నారు.చాలా వరకు లాక్‌డౌన్ ఉన్నా కూడా సామాన్యుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పలు రంగాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే లాక్‌డౌన్ ఇంకా ఉందని మాత్రం ప్రజల్లో అదే మూడ్ కొనసాగబోతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆకలి చావు సంభవిస్తున్న నేపథ్యంలో తప్పనిసరిపరిస్థితుల్లో సడలింపులకు రెడీ అయ్యారు.