మహానటి కీర్తి సురేష్ లైఫ్ లో ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

సినీ ఇండస్ట్రీలో పాత తరం సావిత్రిని చూడలేకపోయాం అని బాధపడే మన తరం వారంతా కూడా మహా నటి సినిమాలో కీర్తి సురేష్ నటన చూసి సాక్షాత్తు సావిత్రి గారే వచ్చారా అని అనుకునేంతగా నటించి ఈ సినిమాతో తెలుగు తెరపై తనకంటూ ఓ చరిత్రను రాసుకుంది.ఈ ఒక్క సినిమా చాలు కీర్తి సురేష్ ఈనాటి తరంలో ఏనాటి నటో చెప్పటానికి.

 Keerthy Suresh Life Unknown Facts Keerthy Suresh, Tollywood, Mahanati Movie , S-TeluguStop.com

అంతే కాదు అచ్ఛం తెలుగింటి అమ్మాయిలా కనిపించి కుర్రకారు మనసు దోచే కీర్తి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

కీర్తి మలయాళ నటి మాత్రమే కాదు , మలయాళ నిర్మాత సురేష్ కుమార్ మరియు నటి మేనకల కుమార్తె.

అయితే కీర్తి అక్టోబర్ 17, 1992 లో జన్మించారు.అంతేకాదు కీర్తి బాలనటిగా తెరంగేట్రం చేసి చిన్న తనంలోనే అనేక చిత్రాల్లో అద్భుతంగా నటించారు.కాగా చెన్నైలో నాలుగో తరగతి వరకు తన చదువును కొనసాగించి ఆమె ఆ తర్వాత తన చదువును తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో కొనసాగించారు.ఆ తరువాత పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు తిరిగి మళ్ళి చెన్నైకు వచ్చారు.

అంతే కాకుండా స్కాట్లాండ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయటమే కాక లండన్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పై ఇంటర్న్ షిప్ కూడా చేశారు.అందుకే, తాను సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే, డిజైనింగ్ లో ఉండేదాన్ని అని కీర్తి ఒక ఇంటర్వ్యూలో తెలియజేసారు.అంతేకాదు కీర్తి మలయాళం సినిమాతోనే హీరోయిన్ గా మొదటగా వెండితెరకు పరిచయం అవ్వటం గమనార్హం.2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమా ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా.కాగా ఆ తర్వాత తమిళ్, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటిచడం వలన ఆమెకు తమిళ, తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది.

Telugu Amazon Prime, Chinni, Keerthy Suresh, Mahanati, Mahesh Babu, Menaka, Sure

కాగా కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవటంతో పాటు, భారతదేశ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా మహానటి సినిమాకి గాను కీర్తి సురేష్ ఉత్తమ తెలుగు కథానాయకిగా అవార్డు అందుకుంది.అయితే తరవాత కీర్తి నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ ను మూటగట్టుకోగా కొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ లిస్ట్ లో చేరి కీర్తి అంటే ఐరన్ లెగ్ అని ఆమెతో తీసిన సినిమాలు అంతగా సక్సెస్ ను అందుకోవు అనే ట్రోల్స్ కూడా వినిపించాయి.కాగా కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ “చిన్ని” సినిమా మాత్రం రీసెంట్ గా ఓటిటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ ను అందుకుంది.

Telugu Amazon Prime, Chinni, Keerthy Suresh, Mahanati, Mahesh Babu, Menaka, Sure

అంతేకాదు ‘కీర్తి సురేష్’ జిమ్ లో డైలీ గంట సేపు గడుపుతుంది.నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తుంది.అందుకే ‘కీర్తి సురేష్’ ఈ మధ్య చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపిస్తోంది.ఈ రోజు రిలీజ్ అయిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన జంటగా నటించిన కీర్తి ఈ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ని అందుకుంటుదేమో చూడాలి మరి.ట్రైలర్ మరియు పాటలలో మహేష్ పక్కన సరిగ్గా సూట్ అయింది.కానీ సినిమాలో ఈమె పాత్ర, మహేష్ తో కెమిస్ట్రీ ఎలా ఉంది అన్నది కాసేపట్లో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube