ఆ దేవాలయంలో 130 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అఖండ దీపం..!

తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది.వినాయకచవితి రానున్న నేపథ్యంలో అందరూ కోలాహలంగా ఉన్నారు.

మామూలుగా వినాయక స్వామికి మొత్తం 32 భిన్నమైన పేర్లు ఉన్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి.ఏ పేరుతో వినాయకస్వామిని పూజించినా కూడా శుభాలు కలుగుతాయని నానుడి.

గణపతి దేవునికి భక్తితో పత్రాలను సమర్పించి పూజ చేస్తే చాలు ఆయన ప్రసన్నమైపోతాడు.తమ భక్తులకు కోరిన కోరికలను తీరుస్తాడు.

సాంప్రదాయం ప్రకారంగా చూస్తే ఏ పూజ చేసినా ఏ శుభకార్యం జరిగినా కూడా విఘ్నాలు తొలగిపోవాలంటే మొదటి రోజు గణపతి దేవున్నే పూజించడం ఆనవాయతీ.ఆయన్ని పూజించాకనే మరేదేవున్ని అయినా పూజిస్తారు.

Advertisement
Unknown Facts About Varada Vinayaka Temple In Maharashtra, Viral Latest, Viral N

అటువంటి గణపయ్యకు మహారాష్ట్రలో అద్భుతమైన ప్రాముఖ్యత అనేది ఉంది.మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేయడం విశేషంగా చెప్పొచ్చు.

అష్టవినాయక స్వామి క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం అనాధిగా వస్తూ ఉంది.అటువంటి మొత్తం అష్టవినాయక దేవాలయాలను దర్శించుకోవడానికి 654 కి.మీ.ప్రయాణించాల్సి ఉంటుంది.ఇటువంటి అష్ట వినాయక క్షేత్రాల్లో మనం చూసినట్లైతే వరద వినాకుడి దేవాలయం కూడా ఉంది.

ఇది ఎంతో ప్రసిద్ది చెందినది.పూణే నుండి 146 కి.మీ.దూరంలో మహడ్‌ గ్రామం ఉంది.ఈ ప్రాంతంలో స్వామి వరద వినాయకుడుగా భక్తులతో పూజలను అందుకుంటూ విరాజిల్లుతుంటాడు.

Unknown Facts About Varada Vinayaka Temple In Maharashtra, Viral Latest, Viral N

ఈ దేవాలయంలో వినాయక స్వామి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది.విఘ్నేషుడి తొండం ఎడమ వైపు ఉంటుంది.గుడికి ఆనుకుని ఉండేటటువంటి సరస్సులో వినాయక విగ్రహం బయటపడినట్లుగా స్థల పురాణం తెలియజేస్తోంది.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు.దేవాయల గర్భగుడిలో దీపం గత 1892 ఏళ్ల నుంచి వెలుగుతూనే ఉందని స్థల పురాణం చెబుతోంది.100 ఏళ్లకుపైగా దాదాపుగా 130 ఏళ్లుగా ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉందని భక్తులు చెబుతుంటారు.దేవాలయంలో దాదాపు 130 ఏళ్లుగా దీపం వెలుగుతోందని భక్తులు విశ్వసిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు