శరవణ స్టోర్స్ యాడ్ లో తమన్నా, హన్సికలతో చేసిన వ్యక్తి అసలు కథ తెలిస్తే షాక్ తింటారు.

టివిలో శరవణ బంగారు నగల దుఖాణం యాడ్ వస్తుంటుంది.అందులో ఒకడు నల్లగా పొట్టిగా ఉన్న వాడితో ఇద్దరు హీరోయిన్లు తమన్నా,హన్సిక డ్యాన్స్ వేస్తుంటారు.

ఆ యాడ్ చూసిన ప్రతొక్కరూ వీడెవడు ఇలా ఉన్నాడు.ఈ హన్సికకి,తమన్నాకి ఏం అయింది ఆఖరుకి వీడితో కూడా యాక్ట్ చేసారు అని అనుకోకుండా ఉండరు.

ఇంతకీ ఆ యాడ్స్ లో వచ్చే అతను ఎవరు.అతని పేరేంటి.

అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Advertisement

శరవణ స్టోర్స్ యాడ్స్ లో కనిపించే వ్యక్తి పేరు శరవణ అరుళ్.నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు.అరుళ్ తండ్రి సైకిల్ పై కూరగాయలు అమ్మేవాడు.

ఆయన ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి శరవణ స్టోర్స్ స్థాపించి కొద్దికాలంలోనే లాభాల బాటపట్టించాడు.తన తర్వాత ఆ బిజినెస్ ని కొడుక్కి అప్పగించాడు.

ఈ స్టోర్స్ అరుళ్ చేతికి వచ్చాక బిజినెస్ టాప్ రేంజ్ కి చేరింది.ప్రచారానికి పెద్దపీట వేసే శరవణ్ తన స్టోర్స్ కి సంబందించిన యాడ్స్లో తానే నటిస్తాడు.

చూడడానికి యువకుడిలా కనపడుతున్నాడని చిన్న వయసు వాడే అనుకుంటే తప్పులో కాలేసినట్టే.శరవణ కి పెళ్లైన కూతురుంది తెలుసా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

తన కూతురు పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిపించాడంటే కేవలం పెళ్లికూతురు గౌను కోసం రూ.13 కోట్లు వెచ్చించాడు.వజ్రాలు పొదిగిన ఈ గౌను ని ఫ్రెంచ్ డిజైనర్ల చేత తయారు చేయించాడు.

Advertisement

తన స్థాయికి తగినట్టుగానే రిసెఫ్షన్ ఏర్పాటు చేసాడు.ఈ విందుకు సూపర్ స్టార్ రజనీకాంత్, రిలయన్స్ ముఖేష్ అంబానీ, మైనింగ్ కింగ్ గాలి జనార్థనరెడ్డి వంటి ప్రముఖులు విచ్చేశారు.రిసెప్షన్ లో ఒక్కో వ్యక్తి భోజనం కోసం రూ.10,000 ఖర్చయిందట.ఈయన వద్ద ఉన్న కార్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.రూ.6 కోట్ల విలువైన లేటెస్ట్ మోడల్ లాంబోర్గిని, రూ.8 కోట్ల విలువైన బుకాటి వేరాన్, బీఎండబ్ల్యూ7, జాగ్వార్ ఎక్స్ఎఫ్, రూ.3 కోట్ల విలువ చేసే పోర్షే, ల్యాండ్ రోవర్ కార్లు ఉన్నాయి.ఇవి శరవణ అరుళ్ గురించి సంభందించిన విశేషాలు.

ఎవరైనా తమ కంపెని ప్రొడక్ట్స్ యాడ్స్లో నటించడానికి పెద్ద పెద్ద స్టార్లను ఎంచుకుంటారు.శరవణ మాత్రం కొంచెం డిఫరెంట్ తన స్టోర్స్ కి సంభందించిన యాడ్స్ తనే నటిస్తాడు.

తన పక్కన నటించడానికి మాత్రం ముద్దుగుమ్మలను సెలక్ట్ చేసుకుంటాడు.ఈ యాడ్స్ వలన శరవణ స్టోర్స్ కి ఎంత పేరొచ్చిందో కాని హన్సిక,తమన్నాల పక్కన నటించిన శరవణ అరుళ్ కి మాత్రం చాలా పబ్లిసిటినే వచ్చింది.

తాజా వార్తలు