రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాత్మక దర్శకుడు,వివాదాస్పద దర్శకుడు అంటే అందరికీ వెంటనే రామ్ గోపాల్ వర్మ గుర్తుకు వస్తుంటారు.

ఇక వర్మ వ్యవహార శైలి, ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఎవరికీ ఒక పట్టునా అర్థం కాదు.

అంతేకాదు.ఎప్పుడు తనకు తోచినది మాట్లాడుతూ ఎన్నోసార్లు వివాదాలకు దారితీస్తుంది.

ఇక కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా రామ్ గోపాల్ వర్మ ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి కాదు.అంతేకాక.

ఎంతో భిన్నంగా వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు అనే విషయాలను గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.అయితే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి తన సినీ ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా గోపాల్ రెడ్డి పని చేశారంట.ఈ తరుణంలోనే అలీరామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేవాడని ప్రశ్నించగా.

గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.అహ నా పెళ్ళంట సినిమా షూటింగ్ సమయంలో గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నేను ప్రతి రోజు వస్తాను నన్ను అసిస్టెంట్ గా అనుకోకండి రెగ్యులర్ గా వచ్చి మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తానని చెప్పారంట.

అంతేకాక.ఆ విధంగా నాతో ప్రయాణం చేస్తూ నాగార్జున శివ సినిమాకు ఓకే చెప్పారని అందుకు మీరే సినిమాటోగ్రాఫర్ గా పని చేయాలని రాంగోపాల్ వర్మ అడిగినట్లు చెప్పుకొచ్చారు.కాగా.

గోపాల్ రెడ్డి కూడా సరే అనడంతో వీరి కాంబినేషన్లో శివ సినిమా తెరకెక్కించారు.అయితే శివ సినిమా కోసం నాగార్జున, సురేంద్ర, వెంకట్ గారు సినిమాటోగ్రాఫర్ నా కన్నా పెద్ద వారిని తీసుకోవాలని వారు భావించినప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ససేమిరా అంటూ అవకాశాన్ని తనకూ ఇచ్చారని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక శివ సినిమా విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ వల్లనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని, తను కథ చెప్పేటప్పుడు ఆ విజువల్ ఎఫెక్ట్ కనిపించేదని ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు