కృష్ణ, విజయ నిర్మల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే., కానీ వారి ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.
విజయ నిర్మల కు ఎంతో అత్తమాభిమానం ఉంటుంది అలాగే కృష్ణ పైన అమితమైన ప్రేమ కూడా ఉంటుంది.వారి ప్రేమకు గుర్తుగా ఒక అపురూపమైన సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి రోజుల్లో సినిమాలు షూటింగ్ ఫారెన్ లో చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం.విదేశాలకు వెళ్లడం అక్కడ లొకేషన్స్ ఫిక్స్ చేసుకోవడం షూటింగ్ ఫినిష్ చేసుకొని ఇండియాకు రావడం ఇది ప్రతి సినిమాకు జరుగుతున్న తంతే.
కానీ విదేశాల్లో షూటింగ్ చేయాలంటే భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం అయినా కూడా నిర్మాతలు ప్రస్తుత కాలంలో ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు.అలాగే అంత ఖర్చు పెట్టి కూడా సినిమాను నిర్మించడం కూడా నేటి కాలంలో సాధారణంగానే మారిపోయింది.
కొన్ని సినిమాల విషయాల్లో అయితే పూర్తిగా విదేశాల్లోనే షూటింగ్ జరుగుతున్నాయి.ఇదంతా నేటి సంగతి, కానీ ఒక 30 40 సంవత్సరాల క్రితం వరకు విదేశాల్లో షూటింగ్ జరిగిన సినిమా అంటే అదొక వింత.
అలా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సినిమా హరికృష్ణ అనురాధ.ఈ సినిమా 45 ఏళ్ల క్రితం అమెరికాలో తొలిసారిగా షూటింగ్ జరుపుకుంది.

ఆ కాలంలోనే విదేశాల్లో అత్యధికంగా ఖర్చుపెట్టి ఈ సినిమాను నిర్మించారు అంతేకాదు అక్కడ షూటింగ్ చేయడం అనేది అత్యంత సాహసమైన నిర్ణయం అనే చెప్పాలి.కానీ నాటి నిర్మాత భరణి రెడ్డి అలాగే దర్శకుడు శ్రీధర్ ఆ సాహసాన్ని చేసి ఈ సినిమాని అమెరికాలో షూటింగ్ చేసి విడుదల చేశారు.అయితే ఈ సినిమా కథను బట్టి అమెరికాలో షూటింగ్ చేయలేదు కేవలం అక్కడ షూటింగ్ చేయాలని ఉద్దేశం ఉండడంతో దర్శకుడు ఈ కథను రూపొందించినట్టుగా సమాచారం.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించబడి విడుదలవగా తెలుగు వర్షన్ లో హీరో కృష్ణ నటిస్తే తమిళ వర్షన్ లో హీరో శివచంద్ర నటించాడు ఇక శ్రీ ప్రియ, రతి ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్స్ గా రెండు భాషల్లోనూ నటించడం విశేషం.

ఇక ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ఉండడంతో కృష్ణ బయలుదేరగా విజయ నిర్మలకు సినిమాతో ఎలాంటి పాత్ర లేకపోయినా ఆయనతో పాటు విజయనిర్మల కూడా అమెరికా కలిసి వెళ్లిందని సమాచారం.ఇక ఈ సినిమాలోని ఒక పాట అలాగే కొన్ని సన్నివేశాలు మినహా 70 శాతం షూటింగ్ అంతా కూడా అమెరికాలో జరుపుకుంది.అక్కడ ఫుడ్ విషయంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంతేకాదు విజయనిర్మల తను బస చేసిన హోటల్లోనే అన్ని వస్తువులు తెప్పించుకొని మరి అక్కడే వండేవారట.అంతేకాదు షూటింగ్ స్పాట్ కి కూడా వెళ్లి అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవారట అయితే అమెరికాలో షూటింగ్ కాబట్టి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కాస్త తక్కువ యూనిట్ తోనే అమెరికా వెళ్లాల్సి వచ్చిందట కానీ నేటి రోజుల్లో ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే వందల మంది టీమంతా కూడా ఫారెన్ వెళ్లడం కామన్ అయిపోయింది.
ఇలా విజయ నిర్మల తన భర్తను ఒంటరిగా అమెరికా పంపించడం ఇష్టం లేక తోడుగా తాను వెళ్లడం తో సినిమా అనిత ఒకింత షాక్ కి గురయ్యింది.







