విడిపోయిన భార్యతో షికార్లు చేస్తున్న హీరో సురేష్.. ఆయన రెండవ భార్య మన అందరికి బాగా తెలిసిన వ్యక్తే

సినిమా అనే రంగుల ప్రపంచంలో విహరించడానికి అనేకమంది వస్తుంటారు.కానీ కొందరే ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతూ ఉంటారు.

ఒకప్పుడు స్టార్లుగా ఉన్నా, హీరోగా, నటుడిగా ఎన్ని అద్భుతాలు మెప్పించినా కానీ కొన్నాళ్ళకి మోస్తారు నటుడిగానే ఉండిపోతారు.అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన రోజుల నుంచి, అవకాశాల కోసం వెతుక్కునే రోజులు వస్తాయి.

చిన్న వేషం వస్తే తృప్తి పడే నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.ఇప్పటికీ అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్నారు.

అలాంటి వారిలో హీరో సురేశ్ ఒకరు.హీరోగా, విలన్ గా దాదాపు 270 కి పైగా సినిమాల్లో నటించిన సురేశ్ దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలని తెరకెక్కించారు.

Advertisement
Hero Suresh Biography And Family Details, Hero Suresh ,Hero Suresh Photos With E

అప్పట్లో చాలా సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన సురేశ్, తన విలక్షణ విలనిజంతో ఆకట్టుకున్నారు.ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తూ, సీరియల్స్ లో నటిస్తున్నారు.

సురేశ్, 1963 వ సంవత్సరంలో ఆగస్ట్ 26 న శ్రీకాళహస్తిలో జన్మించారు.తండ్రి గోపీనాథ్, తల్లి రాధాదేవి.

సురేశ్, తాతయ్య అప్పట్లో సినిమాలకు పాటలు, పద్యాలు రాయడంతో ఆ ప్రభావం సురేశ్ మీద పడింది.దీంతో నటన అనేది చిన్నతనం నుంచి బ్లడ్ లో బెడ్ ఏసుకుంది.

అదే సురేశ్ ని నటుడిగా ఎంతో పేరుని తెచ్చిపెట్టింది.

Hero Suresh Biography And Family Details, Hero Suresh ,hero Suresh Photos With E
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

1981 లో పన్నీర్ పుష్కానలం అనే తమిళ్ సినిమా ద్వారా నట ప్రస్తానాన్ని మొదలుపెట్టిన సురేశ్, రామదండు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ఆ రెండు సినిమాలతో తమిళ, తెలుగు భాషల్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.హీరోగా ఒక వెలుగు వెలిగిన సురేశ్, ఆ తర్వాత విలన్ గా కూడా మెప్పించారు.2002 వ సంవత్సరంలో రాఘవ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సురేశ్, కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారు.

Hero Suresh Biography And Family Details, Hero Suresh ,hero Suresh Photos With E
Advertisement

ఆ తర్వాత అనిత అనే అమ్మాయిని సురేశ్ వివాహం చేసుకున్నారు.వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయేవారు.దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది.

మనస్పర్ధలు తలెత్తడంతో సురేశ్, తన భార్యకు విడాకులు ఇచ్చారు.ఆ తర్వాత రాజేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు.

ఆమె ఒక రచయిత, నిర్మాత కూడా.సురేశ్ నటిస్తున్న సీరియల్స్ కు ఆమె రైటర్ గా పని చేస్తున్నారు.ఇక సురేశ్ సినిమానే కాకుండా, సీరియల్స్ ని కూడా ప్రొడ్యూస్ చేశారు.2014 లో మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్షి, రాజేశ్వరి కళ్యాణం, నాటకం వంటి పలు సీరియల్స్ కి నిర్మాతగా ఉన్నారు.సురేశ్ తనయుడు నిఖిల్ సురేశ్, అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు.

నిఖిల్ కు సినిమాల మీద ఇంట్రస్ట్ లేకపోవడంతో ఉద్యోగం చేయాలని భావిస్తున్నాడు.ఇదిలా ఉంటే మొదటి భార్య అనితతో విడిపోయిన తర్వాత కూడా సురేశ్, ఆమెతో స్నేహంగా ఉంటున్నారు.

భార్యాభర్తలుగా కలిసి కప్పు కాఫీ చేసుకోలేకపోయారు గాని, మంచి స్నేహితులుగా చెరో కప్పు కాఫీ తాగుతున్నారు.సురేశ్ లానే అనిత కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

ఇదీ ఒకప్పటి హీరో సురేశ్ కథ.

తాజా వార్తలు