కార్తీకదీపం జ్యోతిరెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..

కార్తీకదీపం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రేక్షక ఆదరణ ఉన్న సీరియల్.సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఏడున్నరకు ప్రసారం అవుతుంది.

ఇదే సీరియల్ హాట్ స్టార్ లో కూడా టెలీకాస్ట్ అవుతుంది.ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఈ సీరియల్ ప్రారంభం అయిన దగ్గర నుంచి టాప్ రేటింగ్ లో దూసుకెళ్తుంది.నిజానికి ఈ సీరియల్ మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ అనే సీరియల్ ఆధారంగా తెలుగులో తెరకెక్కిస్తున్నారు.

ఈ సీరియల్ ద్వారా బాగా గుర్తింపు పొందిన నటి జ్యోతి రెడ్డి.ఇందులో రోషిణి పాత్రలో నటిస్తోంది.ఈమె నటనకు జనాలు ఫిదా అవుతున్నారు.

Advertisement
Unknown Facts About Actress Jyothi Reddy , Karthhedeepam , Jyothi Reddy , Tolly

అంతేకాదు.ఈ సీరియల్ ద్వారా జ్యోతి రెడ్డి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

నిజానికి జ్యోతి రెడ్డి పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది.కార్తీకదీపంతో పాటు పలు ఛానల్స్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లోనూ నటిస్తుంది.

రక్తసంబంధం, ప్రేమ ఎంత మధురం సహా పలు పాపులర్ సీరియల్స్ లో నటిగా కొనసాగుతుంది.జ్యోతిరెడ్డి 1983 ఆగస్టు 4న హైదరాబాద్ లో జన్మించింది.

ఈమె తండ్రి బిఎస్ఎన్ ఉద్యోగి.ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న జ్యోతికి వివాహం అయ్యింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఆమె భర్త ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.ఇద్దరు పిల్లలున్నారు.యశ్వంతో, అభిరాం.

Advertisement

పెద్ద అబ్బాయి మలేషియాలో చదువుతున్నాడు.హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు.

చిన్న అబ్బాయి హైదరాబాద్ లోనే 6వ తరగతి చవుతున్నాడు.

జ్యోతికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.దానితో పాటు నటన అంటే కూడా ఇష్టపడేది.ముందుగా డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పలు స్టేజి షోలు చేసింది.సుమారు 2 వేల ప్రదర్శనలు ఇచ్చింది.

తల్లి ప్రోత్సాహంతో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది.మూడు దశాబ్దాలుగా టీవీ రంగంలో కొనసాగుతుంది.తనకు సపోర్టు చేసే కుటుంబం మూలంగానే తను ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

పలు తెలుగు, సీరియల్స్ లో కొనసాగుతుంది.తన నటనకు ఎన్నో పురస్కారాలు, డ్యాన్స్ ప్రదర్శనలకు ఎన్నో అవార్డులు దక్కాయి.

తాజా వార్తలు