Minister Jaishankar : భారత్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీపై కేంద్ర మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు..!!

అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ( Indian Cricketer Virat Kohli ) అనేక రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

మైదానంలో ఎంతో దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటాడు.

ఫీల్డింగ్ లోనైనా బ్యాటింగ్ లోనైనా అద్భుతమైన ఆట తీరు కనబరిస్తాడు. సచిన్ టెండూల్కర్ కి సంబంధించి అనేక రికార్డులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం జరిగింది.

ఎలాంటి ఒత్తిడి ఉన్నా గాని జట్టుని విజయపథంలో గెలిపించడంలో కోహ్లీ ఆడే తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది.ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలో అత్యధికంగా బ్రాండ్ కలిగిన వ్యక్తులలో కోహ్లీ ఒకరు.

Union Minister Jaishankar Sensational Comments On India Star Batsman Virat Kohl

స్వదేశంలో అయినా విదేశాలలో అయినా ఎలాంటి పిచ్ ఉన్న బౌలర్లకు కోహ్లీ చుక్కలు చూపిస్తాడు.ఒక్కసారి క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు అంటే పరుగుల సునామీ సృష్టిస్తాడు.అటువంటి విరాట్ కోహ్లీ పై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్( Minister Jaishankar ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement
Union Minister Jaishankar Sensational Comments On India Star Batsman Virat Kohl

కోహ్లీకి తాను వీరాభిమానినని చెప్పుకొచ్చారు.అతడిని ఎక్కువగా అభిమానిస్తానని పేర్కొన్నారు.ముఖ్యంగా కోహ్లీలో పోటీ తత్వం తనకు ఎంతగానో నచ్చుతుందని చెప్పుకొచ్చారు.

కేంద్ర మంత్రి జైశంకర్ కి క్రికెట్ అంటే చాలా బాగా ఇష్టం.దీంతో ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో ఆయా అధ్యక్షులు మరియు ప్రధానులకు క్రికెట్ బ్యాట్లను బహుకరిస్తూ ఉంటారు.

ఇటీవలే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్( UK PM Rishi Sunak ) కు బ్యాట్ బహూకరించి క్రికెట్ పై ప్రేమను చాటుకోవటం జరిగింది.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు