సైలెంట్ గా ఉండకపోతే మీ ఇంటికి ఈడి వస్తుందంటూ ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి..!!

ప్రస్తుతం పార్లమెంట్ ( Parliament ) లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి.ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విపరీతంగా నిలదీస్తోంది.

 Union Minister Has Warned The Opposition Party, Parliament , Manipur , Meenaks-TeluguStop.com

మొన్నటి వరకు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ( Modi ) సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని ప్రశ్నించాయి.మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రయత్నాలు కూడా చేశాయి.

దీంతో మణిపూర్ అల్లర్లపై సమాధానం ఇస్తామని అధికార పార్టీ చెప్పడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టారు.కానీ ప్రతిపక్షాలు దేశంలో ఇతర పరిస్థితులపై మంత్రులను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ ( Meenakshi lekhi ) సంచలన వ్యాఖ్యలు చేసింది.గురువారం రోజున లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పై చర్చకు సంబంధించి కేంద్రమంత్రి మీనాక్షి మాట్లాడుతుండగా కొంతమంది ప్రతిపక్ష నేతలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆమెను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.దీంతో ఆమె సైలెంట్ గా ఉండండి సభలో నాకు మాట్లాడే చాన్స్ ఇవ్వండి అన్నది.

వినకుంటే మాత్రం మీ ఇంటికి ఈడి (ED) అధికారులు వస్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Telugu Congress, Meenakshi Lekhi, Narendra Modi, Sakesh Gokale-Politics

దీంతో ఒక్కసారిగా ప్రతిపక్ష నేతలు అంతా షాక్ అయిపోయి ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు.నిజాయితీగా దర్యాప్తు చేసేటువంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని గత కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ తరుణంలోనే కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలైన కీలక నేతలపై ఈడీ,సీబీఐ ( CBI) తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ విధంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకొని బిజెపి ప్రభుత్వం భయపెట్టి వారిని పార్టీలో చేర్చుకుంటుందని ఆరోపిస్తున్నారు.

ఇక ఈ ఆరోపణలు నిజమయ్యేలా కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ ( Meennakshi lekhi) ఎక్కువ మాట్లాడితే ఈడిని పంపుతామని చెప్పడం వారి విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది.

Telugu Congress, Meenakshi Lekhi, Narendra Modi, Sakesh Gokale-Politics

అయితే ఇదే విషయంపై టిఎంసి అధికార ప్రతినిధి సాకేత్ గోకలే ( Sakesh gokale ) మాట్లాడుతూ బిజెపి దర్యాప్తు సంస్థలను, దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.అసలు కేంద్రమంత్రి మీనాక్షి ప్రతిపక్ష నాయకులను హెచ్చరిస్తుందా.? లేదంటే బెదిరిస్తుందా.? అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube