ఢిల్లీ లో ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే.దీనితో అక్కడ పార్టీలు ప్రచారా సభలతో చాలా హడావిడిగా ఉన్నారు.
అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్నాయి.ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ నినాదాలు చేస్తూ ఆ సభకు వచ్చిన వారితో ప్రతి నినాదాలు చేయించారు.
‘‘దేశ్ కే గద్దారోం కో’’ అని అనురాగ్ నినదిస్తే ‘‘గోలీ మారో సాలోం కో’’ (దేశద్రోహులను కాల్చి పాడేయాలి అని అర్థం) అని సభికులు ప్రతి నినాదం ఇచ్చారు.అయితే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడం తో తాజాగా కేంద్రం మంత్రికి ఈసీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
జనవరి 30, మధ్యాహ్నం 12 గంటల లోపు దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ ఈసీ నోటీసుల్లో పేర్కొంది.
మరి దీనిపై కేంద్రమంత్రి గారు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
త్వరలో ఢిల్లీ లో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు,బహిరంగ సభలతో అన్ని పార్టీలు బిజీబిజీ గా అయిపోయాయి.ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
మరి ఢిల్లీ లో కూడా బీజేపీ వ్యూహం ఫలిస్తుందో,లేదో అనేది వేచి చూడాల్సిందే.







