అమెరికా చదువులు: తగ్గుతోన్న చైనా స్టూడెంట్స్ తాకిడి, భారతీయ విద్యార్ధులదే హవా

అమెరికా శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.

 Umber Of Indian Students In Us Rose By 12 Per Cent, From China Dropped By 8 Per-TeluguStop.com

విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.

ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.

అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.

చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్ధుల్లో చైనీయులదే హవా.ఆ తర్వాతి స్థానం భారతీయులదే.అయితే ఇటీవలి కాలంలో ఈ గణాంకాల్లో మార్పులు వస్తున్నాయి.

మన స్టూడెంట్స్‌ పెద్ద సంఖ్యలో వీసాలు సంపాదించి అగ్రరాజ్యంలో అడుగుపెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే 2021లో భారతీయ విద్యార్ధుల సంఖ్య 12 శాతానికి పైగా పెరిగింది.ఇదే సమయంలో చైనీయుల సంఖ్య 8 శాతానికి పడిపోయింది.2021లో అమెరికాలో విదేశీ విద్యార్ధుల రాకపై కోవిడ్ ప్రభావం పడిందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తన వార్షిక నివేదికలో తెలిపింది.

Telugu America, Brazil, Canada, China, Immigrant Visa, Scholarexchange, Sevis, K

2021 క్యాలెండర్‌ ఇయర్‌లో ఎఫ్-1, ఎం-1 విద్యార్ధుల ఎస్ఈవీఐఎస్ రికార్డుల సంఖ్య 12,36,748గా వుంది.ఇది 2020 క్యాలెండర్ ఇయర్‌తో పోలిస్తే 1.2 శాతం తగ్గుదల.SEVIS అంటే ‘‘ స్టూడెంట్స్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ F-1, M-1 అనేవి రెండు వలసేతర విద్యార్థి వీసాలు.J-1 కూడా నాన్-ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసా, అయితే ఇది ఎక్కువగా స్కాలర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌‌కు ఇవ్వబడుతుంది.2021లో 8,038 ఎస్‌ఈవీపీ సర్టిఫైడ్ స్కూల్స్ అంతర్జాతీయ విద్యార్ధులను చేర్చుకోవడానికి అర్హత సాధించగా 2020లో 8,639 పాఠశాలలు అర్హత పొందాయి.

చైనా, భారత్‌ల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్ధుల సంఖ్య విషయానికి వస్తే.2020లో 33,569 మంది చైనా విద్యార్ధులు ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వస్తే.భారత్ నుంచి 25,391 మందికి పైగా విద్యార్ధులు అమెరికాకు వచ్చారు.భారతీయ విద్యార్ధుల్లో 37 శాతం మంది మహిళలే.మొత్తం మీద 3,48,992 మంది విద్యార్ధులతో చైనా మొదటి స్థానంలోనూ.2,32,851 మంది విద్యార్ధులతో భారత్ రెండో స్థానంలోనూ వుంది.తర్వాత దక్షిణ కొరియా (58,787), కెనడా (37,453), బ్రెజిల్ (33,552), వియత్నాం (29,597), సౌదీ అరేబియా (28,600), తైవాన్ (25,406), జపాన్ (20,144), మెక్సికో (19,680) ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube