అతిగా వేపింగ్ చేసిన యూకే టీనేజర్.. ఊపిరితిత్తులు పతనం కావడంతో..??

ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌( Electronic cigarettes ) తాగడం చాలామందికి అలవాటైపోయింది.ఈ సిగరెట్స్‌ ఏరోసోల్( Aerosol ) అనే ఒక పదార్థాన్ని విడుదల చేస్తాయి దీనిని తాగుతూ బయటికి వదులుతుంటారు ఒక నిజమైన సిగరెట్ తాగినట్లుగానే పొగ వస్తుంది.

 Uk Teenager's Lungs Collapsed After Over Vaping, Uk News, 17-year-old Girl, Kyla-TeluguStop.com

దీనిని వేపింగ్ అంటారు దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయని తెలిసినా కొంతమంది అలానే తాగుతుంటారు ఇటీవల యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి కైలా బ్లైత్ వేపింగ్ ( Kayla Blythe Vaping )చాలా అతిగా చేసేసింది దీని కారణంగా ఆమె ఊపిరితిత్తులు పతనమయ్యాయి.ఫలితంగా, ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది.

మే 11న, కైలా( Kayla ) తన స్నేహితురాలి ఇంట్లో రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు, ఆమెకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం కష్టమై, చర్మం నీలి రంగులోకి మారింది.ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షించిన వైద్యులు ఆమె ఊపిరితిత్తులు కొల్లాప్స్ అయినట్లు గుర్తించారు.

కారణం ఒక చిన్న గాలి బుడగ (పల్మనరీ బ్లెబ్) కారణంగా ఊపిరితిత్తులలో చిల్లు పడింది.వేపింగ్ వల్ల ఈ బుడగ పెరిగి, చివరికి చిరిగిపోయిందని వైద్యులు తెలిపారు.

కైలాకు ఐదు గంటలకు పైగా శస్త్రచికిత్స చేసి, ఊపిరితిత్తులను సరిదిద్దారు.

Telugu Kyla Blythe, Lungs Collapse, Nri, Uk-Telugu NRI

ఈ ఘటన తమ కుటుంబానికి చాలా భయంకరంగా అనిపించిందని కైలా తండ్రి మార్క్ బ్లైత్( Mark Blythe ) తెలిపారు.తన కూతురును ఆ స్థితిలో చూడటం చాలా బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు.15 ఏళ్ల వయసు నుంచే కైలా వేప్ వాడటం మొదలుపెట్టింది.ఆమె స్నేహితులంతా వేప్ వాడటం సేఫ్ అనుకున్నారు.కైలా 4,000 పఫ్‌లు ఉండే పెద్ద వేప్‌ని కూడా కేవలం వారం రోజుల్లోనే ఖాళీ చేసేంత ఎక్కువగా వాడేది.

కానీ, జరిగిన సంఘటన తర్వాత వేప్ వాడటం చాలా ప్రమాదకరమని ఆమె గ్రహించింది.ఇప్పుడు, ఇతర యువకులు వేప్ వాడకుండా ఉండాలని చెప్పాలని ఆమె తండ్రి అనుకుంటున్నారు.

ఎందుకంటే అది వారి ఆరోగ్యానికి మంచిది కాదు.

Telugu Kyla Blythe, Lungs Collapse, Nri, Uk-Telugu NRI

బ్రిటన్‌లో యువకులలో వేప్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది.యాక్షన్ ఆన్ స్మోకింగ్ అండ్ హెల్త్ (ASH) అనే సంస్థ 2023లో రెండింత ఎక్కువ మంది పిల్లలు వేప్ ప్రయత్నించారని చెప్పింది.కొంతమంది పిల్లలు చాలా చిన్న వయసులోనే, ఐదు సంవత్సరాల లోపే వేప్ వాడటం మొదలుపెడుతున్నారు.

అంత ఎక్కువగా వాడటం వల్ల వారు ఊపిరితిత్తుల సమస్యలతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది.కానీ వేప్ ఊపిరితిత్తులకే కాకుండా మెదడుకు కూడా హాని చేస్తుంది.వేప్‌లలో ఉండే లెడ్, యురేనియం వంటి హానికరమైన పదార్థాలు టీనేజర్ల మెదడు సరిగ్గా ఎదగకుండా ఆపెయ్యొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube