యూఎస్ ఆర్మీ బేస్‌పై యూఎఫ్ఓ చక్కర్లు.. వీడియో వైరల్..

యూఎస్ ఆర్మీ( US army ) బేస్‌పై ఓ వింత వస్తువు ఎగిరినట్లు రీసెంట్‌గా తెలిసింది.ఈ వస్తువుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారి చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

 Ufo Hovers Over The Us Army Base Video Goes Viral, Ufo Video, Jeremy Corbell, Us-TeluguStop.com

ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్ అయిన జెరెమీ కార్బెల్ ఈ వీడియోను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఆ తర్వాత ఇది ఎక్స్ వంటి ఇతర వెబ్‌సైట్లలో కూడా పోస్ట్ చేయడం జరిగింది.

వీడియో బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో ఉంది.ఇది ఆకాశంలో జెల్లీ ఫిష్( Jelly fish ) లాగా కనిపిస్తుంది.ఇది ఇరాక్‌లోని US స్థావరంపై ఎగురుతోంది, ఇక్కడ US సైన్యం ఇతర దేశాలతో కలిసి పనిచేస్తుంది.ఈ వీడియోను సైన్యం రికార్డ్ చేసిందని కార్బెల్( Jeremy Corbell ) చెప్పారు.

ఎవరూ వివరించలేని ఎగిరే వస్తువులను చూడటం గురించి అనేక కథనాలు వస్తున్న క్రమంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది.ఉదాహరణకు, మియామీలో, ఒక మాల్‌కు సమీపంలో జరిగిన కాల్పుల వీడియోలో ఒక గ్రహాంతర వాసిని చూసినట్లు కొందరు ఆరోపించారు.

తర్వాత ఈ ఆరోపణల ప్రకారం 10-అడుగుల గ్రహాంతర వాసి వీడియోలో లేదని పోలీసులు చెప్పవలసి వచ్చింది.

కార్బెల్ వీడియోలో, ఎగిరే వస్తువు నలుపు నుంచి తెలుపుకు, మళ్లీ కలర్‌లోకి మారుతుంది.ఇది బేస్ మీద సాఫీగా కదులుతుంది.కార్బెల్ ప్రకారం, ఆ వస్తువు ఒక సరస్సులోకి వెళ్లి 17 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయింది.

తర్వాత సరస్సు నుంచి బయటకు వచ్చి ఒక కోణంలో చాలా వేగంగా ఎగిరిపోయింది.హీట్‌ను చూడగలిగే ప్రత్యేక కెమెరాలతో కూడా ఆ వస్తువును చూడటం సాధ్యపడలేదట.ఆర్మీ కెమెరాలు సరిగా పని చేయకపోవడానికి ఈ వస్తువు కారణమని కార్బెల్ చెప్పారు.ఆన్‌లైన్‌లో వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.

కొంతమంది ఆ వస్తువు యూఎఫ్ఓ కాదని, కెమెరా లెన్స్‌లోని ఓ డర్టీ పార్టికల్ అయ్యుంటుందని అన్నారు.మరికొందరు ఆ వస్తువు నిజమేనని నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube