భారతీయ హెల్త్ వర్కర్లకు తీపికబురు.. ఆగస్టు 5 నుంచి యూఏఈ రావొచ్చు, కీలక సూచనలివే

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.

అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.

లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.

Advertisement

రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.

పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.

ఇక విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ ఎవరైనా ఆత్మీయులు మరణిస్తే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వీలు లేకుండా పోయింది.కోట్లలో ఆస్తులు, పలుకుబడి వున్నప్పటికీ కూడా ఏం చేయలేక దేవుడిపైనే భారం వేసి బిక్కుబిక్కుమంటూ గడిపిన వారెందరో.

ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఎన్నో సంఘటనలు గతేడాది చోటు చేసుకున్నాయి.వాటిని ప్రపంచం ఇప్పట్లో మరిచిపోలేదు కూడా.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

అయితే వివిధ దేశాలు కరోనా కట్టడి నిమిత్తం విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఇంకా ఎత్తివేయలేదు.ఎప్పటికప్పుడు ఆంక్షలు సడలించాలని భావించినా.

Advertisement

డెల్టా వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దేశాలు వణికిపోతున్నాయి.ఈ క్రమంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రాన్సిట్ అనుమతులు పొందిన దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.

కరోనా వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు ఈ విమానాల ద్వారా తిరిగి యూఏఈ రావొచ్చని పేర్కొంది.అయితే, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

అలాగే యూఏఈ ప్రయాణానికి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా రావొచ్చునని.ఇలాంటి వారు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించాలని తెలిపింది.

ప్రధాన రంగాలైన హెల్త్ వర్కర్స్ (వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్(యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు) యూఏఈ తిరిగి రావొచ్చని షనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించింది.కాగా, కోవిడ్ 19 సంబంధిత ప్రయాణ ఆంక్షలను సడలించడం ద్వారా భారతీయ నిపుణులు, ఇతర కార్మికులు తిరిగి పశ్చిమ ఆసియాకు వెళ్లేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకుంది.

దీనిలో భాగంగా యూఏఈ సహా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.యూఏఈలో 3.42 మిలియన్ల మంది భారతీయులు స్థిరపడినట్లుగా అంచనా.ఆ దేశంలో భారతీయ డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ కేర్ వర్కర్లదే హవా.

ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్‌పై యూఏఈ ప్రయాణ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.నాటి నుంచి ఇండియా నుంచి యూఏఈకి నేరుగా విమానాలు కానీ, ప్రయాణీకులు కానీ రాకుండా నిషేధం కొనసాగుతోంది.ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం యూఏఈ రావాలనుకునే ప్రయాణీకులు.

ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.టీకా సర్టిఫికేట్‌లతో పాటు ప్రయాణికులు బయల్దేరే 48 గంటల లోపే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి.

అలాగే వారు విమానం ఎక్కేముందు కూడా ల్యాబ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.యూఏఈ చేరుకున్న వెంటనే మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి.

హోం క్వారంటైన్‌కు తరలిస్తారు.

తాజా వార్తలు