ఆ ఇద్దరు “టీఆర్ఎస్ నేతలు” కాంగ్రెస్ లోకి జంప్..?

ఎన్నికల వేడి ఎపీకి మాత్రమే కాదు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణకి కూడా పాకుతోంది.

టీఆర్ఎస్ లోకి రావడానికి ఒక పక్క టిక్కెట్లు ఆశిస్తున్న వారు కొంతమంది ఉంటే మరో పక్క పక్క పార్టీలోకి జంప్ చేయడానికి సిద్దంగా మరి కొంతమంది ఉన్నారు.

అయితే నిజామాబాద్ జిల్లాలో అర్బన్, రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతలు వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా పోటీచేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు.సీఎం కేసీఆర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశం ఉంటుందని ప్రకటించిన నేపధ్యంలో తమను తాము సమాధాన పరుచుకున్న నేతలు.

సీఎం కేసీఆర్ మళ్లీ అదే ప్రకటన చేయటంతో టిక్కెట్టు ఆశిస్తున్న వారు డిఫెన్స్‌లో పడ్డారు.అయితే వారిలో ఇద్దరు నేతలు ఇప్పుడు పక్క పార్టీలవైపు చూస్తున్నారు.

అంతేకాదు ఇప్పుడు ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటున్నారు.అయితే తమ అధినేత నుంచీ తమకి భరోసా ఉంటె మాత్రం టీఆర్ఎస్ వెంటే ఉంటామని అంటున్నారట.

Advertisement

ఇదిలాఉంటే.ఇటీవలే కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత చడీచప్పుడు కాకుండా వెళ్లి కలిసినట్లు గుసగుసలు నడుస్తున్నాయి.

తనకు టికెటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధమని ఆ నాయకుడు పీసీసీ చీఫ్‌కి చెప్పినట్లు సమాచారం.కానీ ఉత్తం ఉంచీ ఎటువంటి హామీ లేకపోవడంతో ఇంకా ఆ నేతలు ఖంగారులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.నిజామాబాద్ రూరల్ నుంచి టికెట్ కోసం ఓ టీఆర్ఎస్ నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సీఎం సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని ప్రకటించడంతో ఆ నాయకుడు కూడా తీవ్ర నిరాశకి లోనయ్యారట.దాంతో వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరాల్సిందేనని నాలుగేళ్లుగా పట్టుదలతో ఉన్న ఆ నాయకుడు…కాంగ్రెస్‌ గూటికి వెళ్ళడానికి సర్వం సిద్దం చేసుకున్నాడు అని టాక్.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..

అయితే సదరు నేత అక్కడ ఆన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే కూడా ప్రజలలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడని గమనించిన కాంగ్రెస్ కూడా సదరు నేతకి టిక్కెట్టు ఇచ్చేలానే కనిపిస్తోంది అంటున్నారు.అదేవిధంగా అర్బన్ కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా తమ తమ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని టాక్.

Advertisement

అయితే సదరు మాజీ ఎమ్మెల్సీ కి రేవంత్ అండ గట్టిగానే ఉన్నా సరే కొత్తగా చేరుతున్న వారిని చూస్తుంటే గుబులు రేగుతోందని అంటున్నారట.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలలో ఆశావహులు ఇప్పట్నించే కోరుకుంటున్న సీట్లపై లాబీలు భారీగా చేస్తున్నారు.

మొత్తానికి కేసీఆర్ నోటి వెంట సిట్టింగ్ అనే చిన్న మాట కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేలా ఉంది అంటున్నారు విశ్లేషకులు.

తాజా వార్తలు