విజయ్ దేవరకొండ కోసం ఇద్దరు దర్శకులు వెయిటింగ్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తుండగా ఆ తర్వాత ప్రాజెక్ట్ పూరీ డైరక్షన్ లోనే జన గణ మన ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత సుకుమార్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.కానీ ఇప్పటివరకు ఆ సినిమా అప్డేట్ రాలేదు.

పుష్ప 2 తర్వాత సుకుమార్ దాదాపు వీయ్ దేవరకొండతోనే సినిమా చేస్తారని తెలుస్తుంది.సుకుమార్ మాత్రమే కాదు విజయ్ దేవరకొండతో సినిమా కోసం మరో సక్సెస్ ఫుల్ డైరక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కూడాఅ వెయిటింగ్ లో ఉన్నారు.

సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్న ఇంద్రగంటి మోహనకృష్ణ తన నెక్స్ట్ సినిమాని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నారు.విజయ్ కూడా అతని డైరక్షన్ లో చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

Advertisement

కానీ సుకుమార్ లైన్ లో ఉన్నాడు కాబట్టి సుకుమార్ తర్వాత ఇంద్రగంటికి ఛాన్స్ ఇస్తాడని టాక్.మొత్తానికి విజయ్ వరుస క్రేజీ సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు