తిరుపతి( Tirupati ) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.చిల్లకూరు జాతీయ రహదారిపై ( Chillakuru National Highway )ఉన్న టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.అలాగే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







