ఆర్తి అగర్వాల్ కారణంగా ఆ ఇద్దరి హీరోయిన్స్ జీవితం నాశనం అయ్యిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal ) కచ్చితంగా ఉంటుంది.విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’( Nuvvu Naaku Nachav ) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఆర్తి అగర్వాల్, తొలి సినిమానే పెద్ద సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది.

 Two Heroines Ruined In Aarthi Agarwal Era Details, Aarthi Agarwal , Reema Sen,-TeluguStop.com

అలా ఆమె చూస్తూ ఉండగానే ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోయింది.అయితే ఈమె రాక దెబ్బకి అప్పట్లో టాలీవుడ్ లో కొంత మంది యంగ్ హీరోయిన్స్ అడ్రస్సు గల్లంతు అయ్యింది.

హీరోయిన్ కెరీర్ అంటే ఇంతే ఉంటుంది.ఫేమ్ ఉన్నన్ని రోజులు చక్రం తిప్పుతారు, ఎవరైనా కొత్త హీరోయిన్ వచ్చి సక్సెస్ అయితే అకస్మాత్తుగా డిమాండ్ ని కోల్పోతారు.

అందుకే హీరోయిన్ కెరీర్ కేవలం 5 నుండి 10 సంవత్సరాల వరకే ఉంటుంది.

Telugu Aarthi Agarwal, Anitha, Rama, Reema Sen, Shriya Saran, Tollywood, Trivikr

అలా అప్పట్లో ఆర్తి అగర్వాల్ రాకతో రీమా సేన్( Reema Sen ) మరియు అనిత( Anitha ) వంటి యంగ్ హీరోయిన్ల కెరీర్స్ మీద బలమైన ప్రభావం పడింది అట.ఈ ఇద్దరు హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంవత్సరానికి ఆర్తి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది.అంటే దాదాపుగా ఈ ముగ్గురు ఒకే సమయం లో ఎంట్రీ ఇచ్చినట్టే అన్నమాట.

కానీ ఇండస్ట్రీ ఎందుకో ఎక్కువగా ఆర్తి అగర్వాల్ వైపే మొగ్గు చూపించింది.ముగ్గురికి యాక్టింగ్ టాలెంట్ అద్భుతంగానే ఉంది, కానీ అనిత మరియు రీమాసేన్ తో పోలిస్తే ఆర్తి అగర్వాల్ స్కిన్ టోన్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉండడం తో ఆర్తి అగర్వాల్ వైపే దర్శక నిర్మాతలు ఎక్కువగా మొగ్గు చూపేవారు.

దీంతో సమకాలం లోనే వచ్చి మంచి క్రేజ్ ని సంపాదించిన మిగిలిన ఇద్దరు ముద్దుగుమ్మల కెరీర్స్ డీలా పడ్డాయి.

Telugu Aarthi Agarwal, Anitha, Rama, Reema Sen, Shriya Saran, Tollywood, Trivikr

అప్పట్లో ఆర్తి అగర్వాల్ డేట్స్ సర్దుబాటు కాకపోతే రీమా సేన్ మరియు అనిత లకు అవకాశాలు వచ్చేవి కానీ, అందరికీ మొదటి ఛాయస్ మాత్రం ఆర్తినే.పైగా ఆర్తి కి అప్పట్లో రామానాయుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు కూడా అవకాశాలు బాగా ఇప్పించేవారు.ఇక శ్రీయా( Shriya ) ఎంటర్ అయ్యాక రీమా సేన్ మరియు అనిత ఫేడ్ అవుట్ అయిపోయారు.

శ్రీయా ఎంట్రీ ఆర్తి అగర్వాల్ కెరీర్ మీద కూడా ప్రభావం చూపించింది.ఆమె హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాల్లో ఆర్తి అగర్వాల్ సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube