Ashwini Sri Rathika : రెండు తప్పులు, రెండు ఎలిమినేషన్లు.. బిగ్ బాస్ ఆడ లేడీస్ లబోదిబో…!

బిగ్‌బాస్ సీజన్ 7 12వ వారం నేటితో ముగియనుంది.అయితే ఈ వీక్ శనివారం ఎపిసోడ్‌లోనే అశ్విని శ్రీని ఇంటికి పంపించేశారు.

 Two Eliminations In Bb This Week-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మ హౌజ్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది.అప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల ఆటతీరును ఆమె గమనించి, ఆపై ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని ఆడాల్సింది, కానీ అలా చేయడంలో ఆమె విఫలమైంది.

అందుకే ఇంటి బాట పట్టింది.ఈ ముద్దుగుమ్మ చివరి వరకు ఉంటానని భావించినట్లు ఉంది.

అందుకే ఇంటికి వెళ్లి పోయేటప్పుడు తెగ ఏడ్చేసింది.తనని అన్యాయంగా ముందే పంపిస్తున్నారన్నట్లు ప్రవర్తించింది.

ఆటల్లో కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఈ ముద్దుగుమ్మది తక్కువే.

Telugu Arjun, Ashwini, Rathika, Shivaji, Tollywood-Movie

అశ్విని శ్రీ( Ashwini Sri ) బిగ్‌బాస్ రూల్స్ ప్రకారం ఎవరినీ నామినేట్ చేయకుండా చివరికి ఆమెకు ఆమె సెల్ఫ్ నామినేట్ అయ్యింది, అదే ఆమె చేసిన బ్లెండర్.అదే చివరికి ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేసింది.నిజానికి ఈ తార చాలా అందంగా ఉంటుంది కానీ తెలివి మాత్రం చాలా తక్కువ.

ఈమెను ప్రేక్షకులు కూడా ఎక్కువ ఓట్లు వేసి లీస్ట్ ప్లేస్ కి తీసుకొచ్చారు.అందుకే మధ్యలోనే వచ్చి మధ్యలోనే వెళ్లిపోయింది.

Telugu Arjun, Ashwini, Rathika, Shivaji, Tollywood-Movie

ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి నేడు రతిక( Rathika ) వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ రతిక కోసం వాడుతాడు కదా అని మరొక ప్రచారం సాగుతోంది.అలాంటప్పుడు రతికను నిజంగానే ఆదివారం ఎలిమినేట్ చేశారా.? అనేది సస్పెన్స్ గా మారింది.అత్యంత విశ్వసినీయ వర్గాలు మాత్రం సండే ఎపిసోడ్ లో రతిక ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు.ఒకవేళ రతికను సేవ్ చేసి ఉంటే ఆమెకు బదులుగా అర్జున్ ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు.

అయితే అర్జున్‌ను సేవ్ చేయడానికి ఒక కారణం ఉందని అంటున్నారు.శివాజీ( Shivaji ) టీమ్‌లో అర్జున్ చేరాడు.

ఆ సమయంలో అర్జున్ భార్య కడుపుతో ఉందని, ఆమె భర్తకు తాను సపోర్ట్ చేస్తానని శివాజీ సెంటిమెంట్ మాటలు చెప్పాడు.సండే ఎపిసోడ్‌లో కూడా తను అదే మాటలు చెప్పగానే ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ అర్జున్ కోసమే వాడాడని తెలుస్తోంది.

దాని ఫలితంగా అర్జున్ బదులు రతిక ఎవిక్ట్ అయిందని సమాచారం.నిజానికి రతిక శివాజీ బ్యాచ్ ను చాలా నమ్మింది కానీ ఆ బ్యాచే ఆమెకు వెన్నుపోటు పొడిచినట్లు ఇప్పుడు సమాచారం అందుతుంది.

ఆమె సొంతంగా తనకు తాను ఆడుకున్నట్లైతే తప్పనిసరిగా టాప్ 5 లో ఉండేది.కానీ శివాజీ టీఎం తనని కాపాడుతుందని నమ్మి పెద్ద తప్పు చేసింది.

వీరిద్దరూ వెళ్లిపోవడం వల్ల హౌస్ లో మొత్తం ఇద్దరు ఆడవారు మాత్రమే మిగులుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube