బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వారేనా..?

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్ సీజన్ 4 ఎట్టకేలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 4పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.

ఇక ఈ షోలో 16 మంది కంటెస్టెంట్స్‌ను నిర్వాహకులు తీసుకున్నారు.ఎప్పటిలాగే వివిధ రంగాలకు చెందిన వారిని ఈ షోలో తీసుకున్నారు.

Two Comedians For Bigg Boss Wild Card Entry, Bigg Boss, BiggBoss Telugu, Wild Ca

ఇక ఈ సీజన్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు.అయితే ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొందరిని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.కాగా జబర్దస్త్ కమెడియన్ అవినాష్, ఈ రోజుల్లో ఫేం కామెడీ యాక్టర్ శశికుమార్‌లను ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

Advertisement

అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌తో పాటు వీరిద్దరు కూడా జాయిన్ అయితే ఈ షోలో కామెడీ నవ్వులు పూయడం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు.అవినాష్, శశికుమార్ ఇద్దరు కూడా తమదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.

వీరిద్దరి ఎంట్రీతో బిగ్‌బాస్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టంట్స్‌లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు తెప్పించేందుకు బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోయేది నిజంగానే ఈ కమెడియన్సా లేక వేరేనా అనేది తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం సాగుతున్న బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతూ ముందుకు దూసుకెళ్తోంది.

మరి ఈ షో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు