ర‌విప్ర‌కాశ్ ఉంటే ఏంటి? లేక‌పోతే ఏంటి? నేనే మొన‌గాడిని!

రవిప్రకాశ్‌ తెలుసు కదా.తెలుగులో టీవీ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి.

అసలు తెలుగు వాళ్లకు న్యూస్‌ చానెల్ అంటే టీవీ 9 అనే స్థాయికి ఆ చానెల్‌ను తీసుకెళ్లారు.సెన్సేషనలిజానికి ఆ చానెల్‌ కేరాఫ్‌ అడ్రెస్‌.

బ్రేకింగ్‌ న్యూస్‌లను తనదైన స్టైల్లో అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం టీవీ 9 ప్రత్యేకత.దశాబ్దన్నర కాలంగా ఆ చానెల్‌ ఆధిపత్యాన్ని అధిగమించడానికి మిగతా న్యూస్‌ చానెల్స్‌ చాలా ప్రయత్నాలే చేశాయి.

చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆ చానెల్‌కు సమానంగా రేటింగ్స్‌ సాధించడం, దాని దరిదాపుల్లోకి వెళ్లడం చేశాయి.అయితే ఈ మధ్య టీవీ 9లో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Tv9 Trp Ratings Increased-ర‌విప్ర‌కాశ్ ఉంటే ఏ

యాజమాన్యం మారిపోయింది.చానెల్‌కు మూలస్తంభంగా ఉన్న సీఈవో రవిప్రకాశ్‌ అవమానకర రీతిలో ఆ చానెల్‌ను వీడాల్సి వచ్చింది.

ఫోర్జరీ కేసులో ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ కూడా చేశారు.అయితే రవిప్రకాశ్‌ లేకపోవడంతో టీవీ 9 పనైపోయినట్లేనని చాలా మంది భావించారు.

Tv9 Trp Ratings Increased

ఆ చానెల్‌ను వెనక్కి నెట్టడానికి ఇదే మంచి సమయమని మిగతా చానెల్స్‌ కూడా ఆశించాయి.అందుకు తగినట్లే మొదట్లో టీవీ 9 రేటింగ్స్‌ కాస్త పడిపోయినట్లుగా కనిపించాయి.కానీ తాజాగా ఈ ఏడాది 45వ వారానికి సంబంధించిన రేటింగ్స్‌ మిగతా చానెల్స్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చాయి.76.26 రేటింగ్‌తో టీవీ 9 ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం విశేషం.రెండోస్థానంలో ఉన్న వీ6 చానెల్‌ 32 పాయింట్లు వెనుకబడి 44 రేటింగ్‌తో సరిపెట్టుకుంది.

మరో విచిత్రం ఏమిటంటే.టాప్‌ 5 చానెల్స్‌ మినహాయించి ఆ తర్వాత ఉన్న పది చానెళ్ల రేటింగ్స్‌ అన్నీ కలిపినా టీవీ 9కు సమానంగా లేవు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

రవిప్రకాశ్‌ చానెల్‌ను వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ తన మార్క్‌ను నిలబెట్టుకోవడానికి టీవీ 9 గట్టి ప్రయత్నాలే చేస్తోంది.కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించడంతోపాటు బిత్తిరి సత్తిలాంటి జనాదరణ ఉన్న వ్యక్తిని తెచ్చి పెట్టుకుంది.

Advertisement

దీంతో మొదట్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఆ చానెల్‌.క్రమంగా మళ్లీ తన పునర్‌వైభవాన్ని చాటుకుంటోంది.

తాజా వార్తలు