ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు వెంటనే ఇలా చేయండి!

ఇటీవల కాలంలో చాలా మందికి తెల్ల జుట్టు( White hair ) అనేది పెద్ద సమస్యగా మారుతుంది.

వయసు పైబడిన వారిలోనే కాదు వయసు లో ఉన్న వారు కూడా వైట్ హెయిర్ తో బాధపడుతున్నారు.

ముఖ్యంగా 30 ఏళ్లకే కొందరికి జుట్టు నెరిసిపోతుంది.అయితే తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే ఎక్కువ శాతం మంది వాటిని కవర్ చేసుకునేందుకు మార్కెట్లో దొరికే హెయిర్ డై వాడుతున్నారు.

కానీ వాటిల్లో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటాయి.అవి అనేక సమస్యలకు కారణం అవుతాయి.

అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ట్రై చేస్తే తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవచ్చు.పైగా ఈ రెమెడీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్( Tea Powder ) మరియు ఐదారు లవంగాలు( Clove ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో డికాక్షన్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.

ఈ లోపు ఒక బీట్ రూట్ నుంచి జ్యూస్ ను తీసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.

అలాగే అర కప్పు బీట్ రూట్ జ్యూస్ మరియు అర కప్పు టీ డికాక్షన్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.అరగంట అయ్యాక జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Advertisement

వారానికి ఒక్కసారి ఈ రెమెడీ ని ఫాలో అయితే జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.ఈ రెమెడీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.వైట్ హెయిర్ ను సమర్థవంతంగా నివారిస్తుంది.

కాబట్టి 30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందని వర్రీ అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

తాజా వార్తలు